నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం: ముత్యాల తలంబ్రాలతో కెసిఆర్ వెంట హిమాన్షు(పిక్చర్స్)
ఖమ్మం: భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం కన్నులపండువగా జరిగింది. మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం 12గంటలకు స్వామివారు సీతమ్మవారి మెడలో మాంగల్య ధారణ గావించారు.
వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అత్యంత వైభవోపేతంగా జరిగిన కల్యాణమహోత్సవాన్ని తిలకించేందకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. తొలుత ఆలయంలో ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించిన తర్వాత.. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా సీతారాములు పల్లకీలో కల్యాణ మండపానికి వేంచేశారు.
వేదపండితులు తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వవిజ్ఞాన శాంతికి విష్వక్సేనుని పూజించారు. అనంతరం కల్యాణ క్రతువులో ఒక్కో ఘట్టాన్ని వివరిస్తూ అర్చక పండితులు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.
మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా వేదమంత్రోచ్చరణల నడుమ అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. అశేష భక్తజనం రామనామం జపిస్తుండగా... వేదపండితులు సీతమ్మవారికి మాంగల్యధారణ గావించారు. భక్త రామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి ధరింపజేయడం ఈ క్షేత్ర ఆచారం.
పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్ దంపతులు
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందచేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పట్టువస్త్రాలు సమర్పించారు.
అంతకు ముందు కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్ లో భద్రాచలం చేరుకున్నారు. శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్ కు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
కాగా, కేసీఆర్ దంపతుల వెంట వారి మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా వచ్చాడు. పట్టు వస్త్రాలు కలిగిన పళ్లేన్ని కేసీఆర్ నెత్తికెత్తుకోగా, హిమాన్షు ముత్యాల తలంబ్రాలున్న పళ్లేన్ని తలపై పెట్టుకుని వచ్చాడు. ముందుగా కేసీఆర్ అందించిన పట్టు వస్త్రాలను తీసుకున్న అక్కడి పూజారులు ఆ తర్వాత హిమాన్షు నెత్తిపై ఉన్న ముత్యాల తలంబ్రాలను అందుకున్నారు.
భద్రాచలంతోపాటు తెలంగాణలోని వేములవాడలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట ఆలయంలో రాములవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 20న సీతారాముల కల్యాణ మహోత్సవం ఇక్కడ వైభవంగా నిర్వహించనున్నారు.

నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం: ముత్యాల తలంబ్రాలతో కెసిఆర్ వెంట హిమాన్షు
భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం కన్నులపండువగా జరిగింది.

నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం: ముత్యాల తలంబ్రాలతో కెసిఆర్ వెంట హిమాన్షు
మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం 12గంటలకు స్వామివారు సీతమ్మవారి మెడలో మాంగల్య ధారణ గావించారు.

నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం: ముత్యాల తలంబ్రాలతో కెసిఆర్ వెంట హిమాన్షు
వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అత్యంత వైభవోపేతంగా జరిగిన కల్యాణమహోత్సవాన్ని తిలకించేందకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు.

నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం: ముత్యాల తలంబ్రాలతో కెసిఆర్ వెంట హిమాన్షు
తొలుత ఆలయంలో ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించిన తర్వాత.. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా సీతారాములు పల్లకీలో కల్యాణ మండపానికి వేంచేశారు.

నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం: ముత్యాల తలంబ్రాలతో కెసిఆర్ వెంట హిమాన్షు
వేదపండితులు తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వవిజ్ఞాన శాంతికి విష్వక్సేనుని పూజించారు. అనంతరం కల్యాణ క్రతువులో ఒక్కో ఘట్టాన్ని వివరిస్తూ అర్చక పండితులు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.

నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం: ముత్యాల తలంబ్రాలతో కెసిఆర్ వెంట హిమాన్షు
మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా వేదమంత్రోచ్చరణల నడుమ అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు.

నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం: ముత్యాల తలంబ్రాలతో కెసిఆర్ వెంట హిమాన్షు
అశేష భక్తజనం రామనామం జపిస్తుండగా... వేదపండితులు సీతమ్మవారికి మాంగల్యధారణ గావించారు. భక్త రామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి ధరింపజేయడం ఈ క్షేత్ర ఆచారం.

నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం: ముత్యాల తలంబ్రాలతో కెసిఆర్ వెంట హిమాన్షు
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందచేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పట్టువస్త్రాలు సమర్పించారు.

నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం: ముత్యాల తలంబ్రాలతో కెసిఆర్ వెంట హిమాన్షు
అంతకు ముందు కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్ లో భద్రాచలం చేరుకున్నారు. శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్ కు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం: ముత్యాల తలంబ్రాలతో కెసిఆర్ వెంట హిమాన్షు
కేసీఆర్ దంపతుల వెంట వారి మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా వచ్చాడు. పట్టు వస్త్రాలు కలిగిన పళ్లేన్ని కేసీఆర్ నెత్తికెత్తుకోగా, హిమాన్షు ముత్యాల తలంబ్రాలున్న పళ్లేన్ని తలపై పెట్టుకుని వచ్చాడు. ముందుగా కేసీఆర్ అందించిన పట్టు వస్త్రాలను తీసుకున్న అక్కడి పూజారులు ఆ తర్వాత హిమాన్షు నెత్తిపై ఉన్న ముత్యాల తలంబ్రాలను అందుకున్నారు.

Click it and Unblock the Notifications