2014-2023 వరకు లెక్కలు తేలాలి! 9 నుంచే మహిళలకు ఉచిత బస్సు..: కేబినెట్ భేటీపై శ్రీధర్ బాబు
హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై సుదీర్ఘంగా కేబినెట్ భేటీలో చర్చించినట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర తొలి కేబినెట్ భేటీ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టో అమలు చేయాల్సి ఉందన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలు ప్రజలకు తెలియాలని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు ఆర్థిక వ్యవహారాలను తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ప్రతి పైసా గురించి తెలియాలని.. ఆ మొత్తంలో ఎంత వరకు ప్రజలకు చేరిందనేది కూడా తెలియాలన్నారు.

2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు ఏ శాఖలో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు.. దేనికి ఎంత ఖర్చు చేశారు, వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంత వరకు చేరువయ్యాయనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా అన్ని వివరాలతో కూడిన అన్ని అంశాలు తెలియజేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు.
సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండు హామీలను అమలు చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తామని చెప్పారు. రూ. 10 లక్షల పెంపుతో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ రెండు గ్యారంటీలపై ఆయా శాఖల అధికారులతో శుక్రవారం సీఎం రేవంత్ చర్చిస్తారని ఆయన తెలిపారు. ఇతర హామీల అమలుపైనా కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా సాగుకు 24 గంటల కరెంటు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షిస్తారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. గత తొమ్మిదేళ్లుగా విద్యుత్ కు సంబంధించిన గత రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేదన్నారు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పై సమీక్షించామని తెలిపారు.
డిసెంబర్ 9న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉంటుందన్నారు. ప్రొటెం స్పీకర్ ను గవర్నర్ నియమించిన తర్వాత.. వారి చేతుల మీదుగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటుందని మంత్రి తెలిపారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలకు ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు పరిశీలిస్తారన్నారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని శ్రీధర్ బాబు తెలిపారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రూప్-2 అంశంపైనా చర్చించినట్లు తెలిపారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications