తరిమికొడ్తాం: ఆంధ్ర స్టాఫ్‌కు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఏపీఎన్జీఓ హోంలో బతుకమ్మను ఆడుకోనివ్వకుండా అడ్డుపడిన ఘటనలు పునరావృతమైతే సీమాంధ్ర ఉద్యోగులను పొలిమేర దాకా తరిమికొడతామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఏపీఎన్జీఓ హోంలో కొందరు మహిళలు బతుకమ్మ ఆడుకోవటానికి ప్రయత్నిస్తే, ఆ కార్యాలయ ద్వారానికి తాళం వేసి, పోలీసు బలగాలను మోహరించటాన్ని తప్పుపట్టారు. ‘‘మా కళ్ల ముందు.. మా గడ్డపై బతుకమ్మను ఆడనివ్వకపోవటం ఏ సంస్కృతికి నిదర్శనం'' అని ప్రశ్నించారు. బతుకమ్మ ఆడటానికి ప్రయత్నించిన మహిళలతో సీమాంధ్ర ఉద్యోగులు అసభ్యంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు రెచ్చగొట్టినా భయపడాల్సిన అవసరం లేదని, వాళ్ల సంగతి చూసుకుంటామని హెచ్చరించారు.

Srinivas goud warns Andhra staff

తమ ప్రభుత్వంలోనూ ఆంధ్రా పోలీసులున్నారని, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల్లో సీమాంధ్ర వారూ ఎక్కువగా ఉన్నారని, వాళ్లు ఇక్కడి నుంచి ఎలాగూ వెళ్లిపోతారని, పోయే ముందు హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అసత్య ప్రచారాలతో అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని, వాళ్లపైనా తాము పడుతామని చెప్పారు.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడుతున్నారని అంటూ పొన్నాల నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని శ్రీనివాస గౌడ్ హితవు పలికారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య తన స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, జాతీయ పార్టీ అని చెబుతున్న టీడీపీకి ఆర్‌.కృష్ణయ్యను అధ్యక్షుడిని చేయాలని డిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+