వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Statue Of Equality: భక్తులకోసం సమతామూర్తి సందర్శనా వేళలు ప్రకటన.. ఎప్పటినుండి అంటే

|
Google Oneindia TeluguNews

సమానత్వ విగ్రహంగా పిలువబడే రామానుజాచార్య 216 అడుగుల భారీ విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించి జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో 45 ఎకరాల సువిశాల స్థలంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది భారతదేశంలో రెండవ ఎత్తైన విగ్రహం. ఈ విగ్రహాన్ని సందర్శించడానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు, భక్తులు చాలామంది సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్తున్నారు. అయితే సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించాలని భావిస్తున్న భక్తుల కోసం నిర్వాహకులు సందర్శన వేళలు ప్రకటించారు.

Recommended Video

Statue Of Equality : Special Events Will Be Conducted For 10 Days | Oneindia Telugu

కర్మాన్‌ఘాట్ లో ఉద్రిక్తత; గోరక్షకులపై కత్తులతో దుండగుల దాడి; ఆందోళనకు దిగిన హిందూసంఘాల అరెస్ట్కర్మాన్‌ఘాట్ లో ఉద్రిక్తత; గోరక్షకులపై కత్తులతో దుండగుల దాడి; ఆందోళనకు దిగిన హిందూసంఘాల అరెస్ట్

 సమతామూర్తి సందర్శన వేళలు ప్రకటించిన నిర్వాహకులు

సమతామూర్తి సందర్శన వేళలు ప్రకటించిన నిర్వాహకులు


సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు భక్తులను అనుమతిస్తామని నిర్వాహకులు తెలిపారు. సమతా మూర్తి కేంద్రానికి బుధవారం సెలవు ఉంటుందని వెల్లడించారు. ఇక శని, ఆదివారాల్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులు సమతామూర్తిని దర్శించవచ్చునని పేర్కొన్నారు. మార్చి 9వ తేదీ నుంచి ఈ సందర్శన వేళలు అమలులోకి వస్తాయి అని నిర్వాహకులు వెల్లడించారు.

సమతామూర్తి సందర్శన కోసం ప్రవేశ రుసుము ఇలా

సమతామూర్తి సందర్శన కోసం ప్రవేశ రుసుము ఇలా

సమతా మూర్తిని దర్శించుకునే వారికి ప్రవేశ రుసుము 6 నుండి 12 ఏళ్ల లోపు పిల్లలకు అయితే డబ్భై ఐదు రూపాయలు, పెద్దలకు 150 రూపాయలుగా నిర్ణయించారని తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులను ఉచితంగా లోపలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సమతా మూర్తి కేంద్రానికి ఇటీవల శ్రీరామ నగరంగా పేరు ఖరారు చేశారు. శ్రీరామ నగరంలో 216 అడుగుల ఎత్తయిన, 120 కిలోల శ్రీ రామానుజాచార్యులు సమతా మూర్తి విగ్రహ దర్శనాన్ని చేసుకోవాలని ఇప్పటికే చాలా మంది భక్తులు వేచి చూస్తున్నారు.

 బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్ ప్రూఫింగ్ పనులు, ప్రస్తుతం సందర్శన నిలిపివేత

బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్ ప్రూఫింగ్ పనులు, ప్రస్తుతం సందర్శన నిలిపివేత

ప్రస్తుతం రామానుజాచార్యుల సువర్ణమూర్తి విగ్రహ దర్శనం, త్రీడీ మ్యాపింగ్ లేజర్ షో, ఫౌంటైన్ ల అందాలను నిర్వాహకులు తాత్కాలికంగా నిలిపివేశారు. బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫ్రేమ్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి.ఇతరత్రా సాంకేతిక పనుల పూర్తికి యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారు. ఈ పనుల పూర్తికి మరో వారం రోజులు పడుతుంది. ఈ క్రమంలో ఈ మేరకు రామానుజాచార్యుల సువర్ణమూర్తి విగ్రహ దర్శనం ప్రస్తుతం నిలిపివేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

 సమతామూర్తి కొలువైన శ్రీరామ నగరంలో అన్నీ ప్రత్యేకతలే

సమతామూర్తి కొలువైన శ్రీరామ నగరంలో అన్నీ ప్రత్యేకతలే

శ్రీరామ నగరంలో అన్ని ప్రత్యేకతలే. ప్రధాన ప్రవేశద్వారం రూపకల్పన తెలంగాణలోని ప్రసిద్ధ కగాడియా శైలిలో రూపొందించారు. ప్రధాన ద్వారం వద్ద 18 అడుగుల ఎత్తైన హనుమాన్, గరుడ విగ్రహాలను ఉంచారు. ఆలయ గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రామానుజాచార్యుడు జీవితపు 120 సంవత్సరాలను ఇది పురస్కరించుకుంటుంది. తామర పువ్వు పై కూర్చున్న రామానుజాచార్యుల విగ్రహం 5 లోహాలతో తయారు చేశారు. ఈ సమతా మూర్తి మహా విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి .రామానుజాచార్యుల విగ్రహం చుట్టూ నల్ల రాతితో చెక్కబడిన 108 చిన్న ఆలయాలు ఉన్నాయి. వీటిని దివ్యదేశం అంటారు. ఇది బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, తిరుమల తరహాలో రూపొందించటం జరిగింది. ఇవే కాదు శ్రీరామ నగరంలో అన్నీ ప్రత్యేకతలే.. వెళ్లి చూసి తరించే భక్తుల కోసం ఇంకా సర్వాంగ సుందరంగా శ్రీరామ నగరం ముస్తాబవుతుంది.

English summary
Organizers have announced visit times for devotees who wish to visit the Statue Of Equality Center. Visiting hours will be effective from March 9, organizers said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X