హోలీ నాడు పిడిగుద్దులు.. ఆ ఆట ఆడకుంటే అరిష్టం : వింత ఆచారం ఎక్కడో తెలుసా!!

హోలీ పండుగ అంటే అందరూ సరదాగా రంగులు పూసుకుని జరుపుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం లోని ఒక గ్రామం లో హోలీ పండుగ అంటే ఆరోజు ముష్టిఘాతాలకు దిగుతారు. ఇష్టమొచ్చినట్టుగా పిడిగుద్దులతో కొట్టుకుంటారు. అలా పిడిగుద్దులాట ఆడకుంటే తమకు ఎంతో నష్టం జరిగిపోతుంది అని తెగ ఫీల్ అయిపోతారు. ఇంతకీ ఎక్కడా ఆ గ్రామం, ఏంటి ఆ విశేషం అంటే

హోలీ అంటే నాడు ఓ గ్రామంలో వింత ఆచారం

హోలీ అంటే నాడు ఓ గ్రామంలో వింత ఆచారం

హోలీ పండగ రోజు వినూత్న ఆచారంతో ఆకట్టుకునే ఆ గ్రామం మరెక్కడో లేదు నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని హున్స ఈ వింత ఆచారాన్ని పాటించే గ్రామం . హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఆ గ్రామంలో వారు పిడిగుద్దుల ఆటకు రెడీ అయిపోతారు. నిజామాబాద్ జిల్లాలోని హున్సా గ్రామంలోని సంప్రదాయ ఆట పిడిగుద్దులాట . రంగుల పండుగ హోలీ సందర్భంగా హున్సా గ్రామస్థులు తమ గ్రామం యొక్క శ్రేయస్సు మరియు సంక్షేమం కోసం ఈ ఆట ఆడతారు. ఒకవేళ హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట లేకుంటేఆ సంవత్సరంగ్రామంలో ఏదైనా జరిగితేదానికిపిడిగుద్దులాట ఆడకపోవటమే కారణం అని వారంతా బాధపడిపోతుంటారు. అందుకే ప్రతీ ఏటా ఆ గ్రామంలో ఎలాంటి అరిష్టాలు జరగాకుండా హోలీ సంబరాల్లో భాగంగా పిడిగుద్దులాట ఆడతారు. అందుకే ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.

కొట్టుకుని గాయాలైనా సరే ఆట ఆడాల్సిందే

కొట్టుకుని గాయాలైనా సరే ఆట ఆడాల్సిందే

హోలీ రోజు ఎవరైనా రంగులు చల్లుకుంటారు. రంగుల కేళి రంగేళి, సంబరాల హోలీ అంటూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు.ఇష్టంలేని వారు హోలీకి దూరంగా ఉంటారు. అయితే నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని హున్స నేగ్రామంలో హోలీ లో భాగంగామగవారంతా పిడికిళ్ళు బిగించి తెగ కొట్టుకుంటారు. దానికి 'పిడిగుద్దులాట' అని పేరు. ఒకరినొకరు కొట్టుకుంటే రక్తం రాకుండా ఉంటుందా ? గాయాలు కాకుండా ఉంటాయా ? అంటే లేదు అని చెప్పాలి.అయినా.. తమకేమీ కానట్లుగానే ఆ ఆటను కొనసాగిస్తారు. ఇది అనాదిగా అక్కడ వస్తున్నన ఆచారం.

గ్రామంలో మగవాళ్ళంతా పిడిగుద్దులతో హోలీకి రెడీ

గ్రామంలో మగవాళ్ళంతా పిడిగుద్దులతో హోలీకి రెడీ

నేడు హోలీ సందర్భంగాముష్టిఘాతాలతో పిడిగుద్దులు గుద్దుకునే ఆటలో ఉడుం పట్టు పట్టేందుకు సిద్ధమవుతున్నారు గ్రామంలోని మగవారు. ఇదేం ఆట అనిగతంలో ఓసారి ఈ పిడిగుద్దులాటను నిర్వహించలేదట. అయితే ఆ ఏడాది ఊర్లోని ట్యాంకు కూలిందని.. పిడిగుద్దులాటను జరపకపోవడం వల్లే ఈ అనర్థం జరిగిందని ప్రజలు బలంగా విశ్వసించారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా పిడిగుద్దులాట ఆడని గ్రామస్తులు ఈసారి పిడిగుద్దులాటకు రెడీ అయ్యారు. ఈ ఆచారాన్ని వదిలిపెట్టేదే లేదని తేల్చేశారు.ఇకకుల మతాలకు అతీతంగా వారంతా ఈ పిడిగుద్దులాటను ఆడుతారు .

పిడిగుద్దులాట ఆపై ఒకరికొకరు ఆలింగనం

పిడిగుద్దులాట ఆపై ఒకరికొకరు ఆలింగనం


హోలీ రోజు సాయంత్రం గ్రామంలోని ప్రధాన కూడలిలో మగవాళ్ళు పిడికిళ్లను బిగించి ఒకరిపై ఒకరు అరగంట పాటు దాడి చేసుకుంటారు. తర్వాత పరస్పరం అలయ్‌బలయ్‌ చేసుకుంటారు. దోస్తానా చేస్తారు. అందరూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటారు. పిడిగుద్దుల్లో గాయపడిన వారు కామ దహన బుడిదను గాయాలకు పూసుకుంటారు. ఇలా చేస్తే.. మొండి గాయాలైనా మానిపోతాయని నమ్మకం. గ్రామస్థుల అంగీకారంతో ప్రతి ఏటా ఈ పిడిగుద్దులాట జరుపుతున్నామని చెప్తున్నారు . హోలీ స్పెషల్ గా జరిగే ఈ పిడిగుద్దులాట చూడటానికి చుట్టూ పక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+