వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖమ్మం జిల్లాలో వింత .. శ్రీరాముడి విగ్రహం కళ్ళ నుండి కన్నీళ్ళు .. అరిష్టం అని ప్రచారం

|
Google Oneindia TeluguNews

ఖమ్మం జిల్లాలో శ్రీరాముని విగ్రహం కళ్ళవెంట నీళ్లు కారుతున్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు చాలా మంది దీనిని వింతగా చూస్తుంటే, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకటయి తండా గ్రామస్తులు మాత్రం ఇది అరిష్టమని భావిస్తున్నారు.

హుజూరాబాద్ గడ్డ .. టీఆర్ఎస్ అడ్డా .. ఈటలపై టీఆర్ఎస్ నేతల వాగ్బాణాలుహుజూరాబాద్ గడ్డ .. టీఆర్ఎస్ అడ్డా .. ఈటలపై టీఆర్ఎస్ నేతల వాగ్బాణాలు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకటయి తండా లోని రామాలయం లో ఉన్న రాముడు విగ్రహం కళ్ళనుండి నీళ్లు కారుతున్నాయి అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ నోట ఈ నోట ఈ విషయం తెలిసిన వారంతా ఆ వింతను చూడటానికి వస్తున్నారు. అంతేకాదు కొందరైతే ఇది మానవ జాతికి రాబోతున్న ముప్పుకు సంకేతమని చెప్తుంటే, మరికొందరు ప్రస్తుతమున్న వైపరీత్యాల నేపథ్యంలో రాముల వారి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అంటూ రకరకాలుగా చెబుతున్నారు.

Strange in Khammam district .. Tears from the eyes of the idol of Lord Rama

ఇక ఈ ఘటనపై సదరు వెంకటయి తండా వాసులు మాత్రం మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి అరిష్టం జరగబోతుంది అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు వెంకటయి తండావాసులు. ఈ క్రమంలో ఎలాంటి అరిష్టం జరుగకుండా శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం కోసం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న శ్రీరాముని విగ్రహం కళ్ళ నుండి కన్నీరు కారుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న ప్రజలు, శ్రీరాముని విగ్రహం కంట కన్నీరు చూసి మరి ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో అంటూ తెగ ఆందోళన చెందుతున్నారు.

Recommended Video

Noorjahan Mango Costs ₹ 1,000 Per Piece|Madhya Pradesh | Oneindia Telugu

English summary
The incident took place in Khammam district when a statue of Lord Rama was seen tears from the eyes. The incident has become a topic of discussion locally in Khammam district. While many people find it strange, the villagers of Venkatai Thanda in Karepally mandal of Khammam district think it is ominous.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X