విచిత్రం: బీజేపీలో అలా.. కాంగ్రెస్ లో ఇలా.. కీలకనేతల తీరుతో అధిష్టానాలకు తంటాలు!!
తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఇక టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రెండు దఫాలుగా రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టి అధికారంలో కొనసాగుతుండగా, మూడోసారి కూడా పవర్ కోసం పవర్ ఫుల్ పాలిటిక్స్ సాగిస్తుంది. అయితే టీఆర్ఎస్ పార్టీతో తలపడటానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో కీలక నేతల తీరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

బీజేపీలో నియోజకవర్గాలకు వెళ్ళరు.. కాంగ్రెస్ లో నియోజకవర్గాల నుండి బయటకు రారు
భారతీయ జనతా పార్టీలో ఉన్న కీలక నాయకులు నియోజకవర్గాలకు వెళ్లకుండా కేవలం హైదరాబాద్ కే పరిమితమై రాష్ట్ర పదాధికారులు మొదలుకొని రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు రాజకీయాలు చేస్తుండటంతో, నాయకులు నియోజకవర్గాలకు వెళ్లి, పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపాలని, నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ అధినాయకత్వం నెత్తీనోరు కొట్టుకుంటుంది.
ఇక అందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో పదవులున్న కీలక నేతలు తన నియోజక వర్గానికే పరిమితమై, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించడం లేదన్న చర్చ పార్టీలో జరుగుతుంది.

బీజేపీ కీలక నేతల తీరుతో పార్టీకి నష్టం .. కాంగ్రెస్ లో నేతల తీరుతో కష్టం
బీజేపీ నేతలు హైదరాబాద్ కు పరిమితమై, మీడియా ముందు మాట్లాడుతూ, నియోజకవర్గాలకు వెళ్లకుండా పార్టీకి నష్టం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు, వివిధ పార్టీ పదవులలో ఉన్నవారు నియోజకవర్గాలకు పరిమితమై ఇతర నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయకుండా పార్టీకి నష్టం చేస్తున్నారు అన్న భావన వ్యక్తమవుతోంది.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తీసుకురావాలని బలంగా ఉన్న నియోజకవర్గాలలో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తూనే బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై పార్టీ కీలక నేతల దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నప్పటికీ, అందుకు భిన్నంగా నేతలు వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకుని తమ తమ నియోజకవర్గానికే పరిమితం కావడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారైంది.

తమ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్న కాంగ్రెస్ కీలక నేతలు
సీనియర్ నేతలు క్షేత్రస్థాయిలో విరివిగా పర్యటిస్తే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నెలకొంటుంది. కానీ అందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా పర్యటించడం లేదన్న అభిప్రాయం పార్టీ అధినాయకత్వం లో ఉంది. సీనియర్ నేతలైన జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి, షబ్బీర్అలీ, కొండా సురేఖ,గడ్డం ప్రసాద్, నాగం జనార్ధన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, గీతారెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి లాంటి నాయకులు తమ తమ నియోజక వర్గానికే పరిమితమై, ఇతర నియోజకవర్గాలలో పర్యటించకుండా ఉండడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుతో అధిష్టానాలకు తలనొప్పి
రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు అందుకు భిన్నంగా, కేవలం వారి నియోజకవర్గానికే పరిమితం కావడం కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వానికి ఇబ్బంది కలిగిస్తుంటే, అసలు నియోజకవర్గాలకు వెళ్లకుండా రాజకీయాలు చేస్తున్న బీజేపీ నేతల తీరు బిజెపి అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. మొత్తానికి ఒకదానికొకటి భిన్నంగా రెండు పార్టీల నేతలు ప్రవర్తించడం తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications