ఆత్మహత్యల అలజడి: నిన్న హన్మకొండ.. నేడు బెల్లంపల్లి; మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!!
తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. బెల్లంపల్లిలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో విద్యార్థుల బలవన్మరణాలు కూడా కొనసాగుతున్నాయి. పరీక్షల భయంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యల ఆలోచనలు చేస్తుంటే, మరికొందరు పరీక్షలు బాగా రాయలేదని ప్రాణాలు తీసుకుంటున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అన్ని కళాశాలలోనూ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని తాజాగా చోటు చేసుకుంటున్న అనేక ఘటనలు తేట తెల్లం చేస్తున్నాయి.

మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
నిన్నటికి నిన్న హనుమకొండ జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని నాగజ్యోతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని ఏడు నూతుల గ్రామానికి చెందిన నాగజ్యోతి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసింది. మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాసిన నాగజ్యోతి తాను పరీక్ష బాగా రాయలేదని తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఇక ఈ ఘటన మర్చిపోకముందే నిన్న మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

పరీక్ష బాగా రాయలేదని బెల్లంపల్లి విద్యార్థి మనస్తాపం
బెల్లంపల్లి పట్టణంలో కాల్ టెక్స్ ఏరియాకు చెందిన కాపల్లి శివకృష్ణ అనే విద్యార్థి ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు నిన్న శివకృష్ణకు పరీక్షలు ప్రారంభం కావటంతో బెల్లంపల్లిలో పరీక్ష కేంద్రం వద్ద దించి పరీక్షలు బాగా రాయమని చెప్పి మంచిర్యాలకు వెళ్ళిపోయారు. నిన్న ద్వితీయ సంవత్సరం తొలి పరీక్ష అయిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాసి, పరీక్ష బాగా రాయలేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు శివకృష్ణ .

మానసిక ఒత్తిడితో విద్యార్ధి ఆత్మహత్య
తల్లిదండ్రులకు కడుపునొప్పి వచ్చిందని పరీక్ష సరిగా రాయలేకపోయానని చెప్పాడు. అయినా పర్వాలేదని తల్లిదండ్రులు కొడుకును అనునయించే ప్రయత్నం చేశారు. అంతేకాదు కుమారుడు చాలా ఆందోళనగా ఉండడంతో అతని స్నేహితుడికి తమ కుమారుడిని ఓ గంట కనిపెట్టమని తల్లి మరీ మరీ చెప్పింది. అయినప్పటికీ పరీక్ష బాగా రాయలేదని మానసిక ఒత్తిడికి గురైన కాపల్లి శివకృష్ణ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కళాశాల హాస్టల్ లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి శవపంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరం.. విద్యార్థులూ అర్ధం చేసుకోండి
పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు ఒక విద్యార్థి, రెండవ రోజు మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. చిన్న చిన్న కారణాలకే యువత ఆత్మహత్యల బాట పట్టడం యువత మానసిక స్థితికి అడ్డం పడుతుంది. పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న కళాశాలలు కేవలం చదువు పైనే కాకుండా, వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచడం పైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తాజా ఘటనలతో అర్థమవుతుంది. పరీక్షలు బాగా రాయలేదనో, పరీక్షలు రాయాలంటే భయంతోనో ఆత్మహత్యల వంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని విద్యార్థులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications