హఠాత్తుగా విద్యార్థుల ధర్నా
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని సమతా బ్లాకు వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఎవరూ ఉహించని విధంగా.. ఒకేసారి విద్యార్ధులు సచివాలయంలోకి చోచ్చుకువచ్చారు. దీంతో పోలీసులకు, విద్యార్దులకు కొంతసేపు తోపులాట జరిగింది. బోధనా రుసుంల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్ధి నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చామని..కానీ వారికి చీమకుట్టినట్టు కూడా లేదని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేసారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ పై విపక్షాలు ద్వజమెత్తాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications