రోహిత్ ఫ్యామిలీకి స్మృతి ఫోన్, అసలేం జరిగింది.. న్యాయవిచారణ: మోడికి విద్యార్థుల షాక్

హైదరాబాద్/న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయిదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న వేముల రోహత్.. తల్లి, సోదరుడికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం నాడు ఫోన్ చేశారు. కుటుంబానికి న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

వేముల రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. మూడో రోజుల క్రితం ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ హెచ్‌సియుకు వచ్చారు. గురువారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు.

ఇదిలా ఉండగా, శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ఎస్‌యుఐ ఢిల్లీలోని స్మృతి ఇరానీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వెంటనే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రోహిత్ మృతిని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బిజెపి మండిపడుతోంది.

Students disrupt PM Modi's speech at BR Ambedkar University, escorted out

అసలేం జరిగింది... న్యాయ విచారణ

వేముల రోహిత్ మృతి పైన న్యాయవిచారణకు కేంద్ర మానవవనరుల శాఖ సిద్ధమైంది. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల పైన కమిషన్ విచారణ చేపట్టనుంది. కొద్దిసేపటి క్రితమే.. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన ద్విసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా న్యాయ విచారణకు ఆదేశించనుందని తెలుస్తోంది.

మోడీ ప్రసంగాన్ని అడ్డుకోబోయిన విద్యార్థులు

ప్రధాని నరేంద్ర మోడీ లక్నోలోని బిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొని, ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తుండగా కొందరు విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి లాక్కెళ్లిపోయారు. వారిని బయటకు తీసుకు వెళ్లారు.

అనంతరం ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. అందరూ అనుకుంటున్నట్టు మన జీవితం మనం తయారు చేసుకున్నది కాదన్నారు. మనం ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితం ఎందరో మనుషుల త్యాగఫలితమన్నారు. మనం నిజాయతీగా గతాన్ని చూసుకుంటే అందులో మన ఉన్నతికి కష్టపడ్డ వ్యక్తులు ఎందరో తారసపడతారన్నారు.

రాజ్యాంగంలో ఎలాంటి తప్పులు లేకుండా రాయగలిగారంటే అంబేడ్కర్ సామర్థ్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలన్నారు. అంబేద్కర్ జీవితాన్ని తరచి చూస్తే ఎలాంటి లోపమూ కనబడదన్నారు. దేశ భవిష్యత్‌కు ఏది మంచి? ఏది చెడు? అన్న విషయాన్ని ఆనాడే ఆయన నిర్దేశించారన్నారు. స్టార్టప్‌లో దళితులకు ప్రత్యేక స్థానం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+