వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయారెడ్డి సజీవదహనం: సురేష్ కాకుండా.. ఇంకా చాలా మంది హస్తం.. భర్త ‘సీబీఐ’ డిమాండ్

|
Google Oneindia TeluguNews

తహశీల్తార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌లో జరిగిన ఈ హత్య వెనుక కారణాలు ఏమైనప్పటికీ.. ఈ అమానుష సంఘటనను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. తాజాగా తన భార్య మరణంపై విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి చేసినట్టు మీడియాలో వస్తున్న వార్తలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. విజయారెడ్డి హత్యపై సీఎం కేసీఆర్‌తోపాటు పలు రాజకీయ నేతలు, ఉద్యోగ సంఘాలు నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భర్త చేసిన వ్యాఖ్యలు అనేక సందేహాలకు దారి తీస్తున్నాయి. సిద్ధార్థ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..

తహశీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక సంచలన విషయాలు.. అలా వెంటాడి.. బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షితహశీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక సంచలన విషయాలు.. అలా వెంటాడి.. బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి

Recommended Video

తహసీల్దార్‌ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి || Oneindia Telugu
ఏదో కుట్ర ఉందని

ఏదో కుట్ర ఉందని

తన భార్య విజయారెడ్డి హత్య వెనుక ఏదో కుట్ర ఉంది. ఆమె హత్యకు సురేష్ ముదిరాజ్ ఒక్కడే కారణం కాదు. ఈ హత్య వెనుక ఇంకా చాలా మంది హస్తం ఉంది అని భర్త సుభాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యోగ రీత్య తనపై ఎలాంటి ఒత్తిడి, బెదిరింపులు ఉన్నట్టు చెప్పలేదని అన్నారు. హత్య చేయాల్సినంత ఘోరం తన భార్య చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సీబీఐతో విచారణ చేపట్టాలి

సీబీఐతో విచారణ చేపట్టాలి

గౌరెల్లి, బాచారం తదితర ప్రాంతాల్లోని భూముల వివాదమే విజయారెడ్డి హత్యకు కారణమనే ఓ కోణం మీడియాలో వినిపిస్తున్నది. ఈ క్రమంలో తన భార్య హత్యపై ప్రభుత్వం సరైన రీతిలో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయారెడ్డి హత్య వెనుక వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

పోలీసులు అదుపులో సురేష్.. కాల్ డేటాపై నజర్

పోలీసులు అదుపులో సురేష్.. కాల్ డేటాపై నజర్

కాగా, విజయారెడ్డి హత్య కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు సురేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సురేష్ ఫోన్ కాల్ డేటాపై దృష్టి పెట్టి.. ఎవరి నుంచి ఫోన్‌లు వచ్చాయి.. సురేష్ ఫోన్ నుంచి ఎవరికి కాల్స్ వెళ్లాయి. హత్యకు ముందు ఎవరితో మాట్లాడారు? హత్యకు సురేష్‌ను ఎవరైనా ప్రేరేపించారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా సురేష్ బంధువులను కూడా అదుపులోకి తీసుకని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తున్నది.

మండిపడుతున్న రెవెన్యూ ఉద్యోగులు

మండిపడుతున్న రెవెన్యూ ఉద్యోగులు


కాగా, విజయారెడ్డి హత్యపై రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. రెవెన్యూ ఉద్యోగులపై కొందరి వ్యాఖ్యల వల్ల ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. తహశీల్దార్ మరణంపై ఆగ్రహించిన నేతలు.. మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చారు. నిందితుడు సురేష్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 అంత్యక్రియలకు ఏర్పాటు

అంత్యక్రియలకు ఏర్పాటు

సోమవారం అబ్దుల్లాపూర్‌లో దారుణ హత్యకు గురైన తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలను మంగళవారం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం విజయారెడ్డి భౌతికకాయం హైదరాబాద్‌లోని కొత్తపేటలో సహ ఉద్యోగులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల చివరిచూపు కోసం ఉంచారు. సాయంత్రం ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

English summary
Subhash Reddy alleges sensationally on her wife Vijaya Reddy's death, He says, that Not only Suresh Mudhiraj, Many hands behind Vijaya Reddy Death. He wanted a probe by CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X