తొలి రోజు విజయవంతంగా వాక్సినేషన్.!సూపర్ స్పైడర్లందరూ సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రులు.!
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమంలో మొదటిరోజైన శుక్రవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వాక్సినేషన్ విజయవంతంగా జరిగిందని నగర పాలక అదికారులు స్పష్టం చేసారు. నిత్య సేవకులుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందిన నిత్య సేవకులకు శనివారం నుండి పది రోజుల పాటు వాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ముప్పై సర్కిళ్లలో విస్తృత ఏర్పాట్లను చేపట్టిందని అధికారలు స్పష్టం చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో తొలిరోజు సక్సెస్.. 21,666 మందికి వాక్సిన్..
ముందుగానే గుర్తించిన వారికి ప్రత్యేక టోకెన్లను గురువారం నాడే అందచేసి వారికి ఇచ్చే వాక్సినేషన్ సమయాన్ని కూడా ప్రత్యేకంగా పేర్కొనడంతో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా కోవిడ్ నిబంధనలతో సజావుగా సాగిందని గ్రేటర్ హైదరాబాద్ తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ స్పైడర్లకు వ్యాక్సీన్ కార్యక్రమం విజయవంతంగా ముందుకు వెళ్తున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొదటి రోజు కావడంతో కొంత అయోమయంతో కొంత మంది టీకాలు వేయించుకోలేక పోయారని, ఆదివారం నుండి పెద్ద సంఖ్యలో వ్యాక్సీన్ ఉపయోగించుకునే అవకాశం ఉందని అదికారలు స్పష్టం చేస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం.. సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రులు..
కాగా నగరంలో చేపట్టిన ఈ ప్రత్యేక వాక్సినేషన్ ప్రక్రియను నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, సీహెచ్.మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హైదరాబాద్ పార్ల మెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తమ పరిధిలోని వాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఏర్పాట్ల పట్ల మంత్రులు సంతృప్తి వ్యక్తం చేస్తూనే ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

క్షేత్ర స్థాయిలో యంత్రాంగం.. వ్యాక్సీన్ కేంద్రాలను తనిఖీ చేస్తున్న అధికారులు..
నగర మేయర్ గద్వాల విజయలక్మ్షి బంజారాహిల్స్ వాక్సినేషన్ సెంటర్ తో పాటు సనత్ నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సెంటర్లను పరిశీలించారు. డిప్యూటి మేయర్ మోతె శ్రీలత సికింద్రాబాద్ సర్కిల్ లోని పలు కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు కేంద్రాలను మేయర్ గద్వాల్ విజయలక్మ్షి, కమిషనర్ లోకేష్ కుమార్ లతో కలిసి సందర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సరూర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, దిల్ సుఖ్ నగర్ రాజధాని థియేటర్ పక్కన ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు.

బృహత్కర కార్యక్రమం.. పదిరోజుల పాటు కొనసాగుతుందన్న అధికారులు..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గోషామహల్ సర్కిల్ లోని రెడ్ రోస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు కేంద్రాన్ని, ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. డిప్యూటి స్పీకర్ పద్మారావు సీతాఫల్ మండి కేంద్రాన్ని పరిశీలించారు. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసి ఫలక్ నూమా సర్కిల్ లోని పలు కేంద్రాలను పరిశీలించారు. ఎమ్మెల్సీలు షంబీపూరి రాజు, నవీన్ రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, పాషా ఖాద్రీ, దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ తదితర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications