హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బైక్‌తో ఢీకొట్టాడని సూడాన్ విద్యార్ధిని చితక్కొట్టిన స్థానికులు, కేసు నమోదు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బైక్‌పై కాలేజీకి వెళ్తున్న సూడాన్ దేశానికి చెందిన విద్యార్ధులు రోడ్డు దాటుతున్న మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఇద్దరు వాహనదారుల మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు సూడాన్ విద్యార్ధిదే తప్పని అతడిపై దాడి చేసి బైక్‌ను ధ్వంసం చేశారు.

ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సూడాన్‌ దేశానికి చెందిన విద్యార్థులు అంజద్‌ ఖలిఫా హమీద్‌, ఇబ్రహీం మహ్మద్‌, ఖలీద్‌ ఇబ్రహీం, మహ్మద్‌ నేబాల్‌, అంజా మహ్మద్‌లు మలక్‌పేటలో ఉంటూ.. దేశ్‌ముఖ్‌లోని సెయుంట్‌ మేరీ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్నారు.

శనివారం సాయంత్రం అంజద్‌ ఖలిపా అమీద్‌ తన బైకుపై ఎల్‌బీనగర్‌ డీవీఎం కళాశాల వద్ద నుంచి వెళ్తుండగా.. రోడ్డు దాటుతున్న తెలుగు విద్యార్థుల బైకుకు ఢీకొట్టాడు. ఇద్దరు వాహనదారుల మధ్య స్వల్పవివాదం జరిగింది. సూడాన్ దేశస్తుడు మలక్‌పేటలో ఉండే తన స్నేహితులకు ఫోన్ చేశాడు.

sudan student attacked in nagole, hyderabad

వారు అక్కడికి చేరుకొనే లోపే కొందరు గుర్తి తెలియని వ్యక్తులు సూడాన్ దేశస్తుడిదే తప్పని, అతడిపై దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేలోపు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా బాధిత సూడాన్ విద్యార్థి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా తెలుగు యువకుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని, వారి వివరాలు కూడా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

English summary
Sudan student attacked in nagole, hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X