కన్నా కోడలు మృతి కేసులో ట్విస్ట్, అనుమానం ఉంది: భర్త, తోడల్లుడితో ఆర్థిక లావాదేవీల్లో వివాదాలు..

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కోడలు సుహారిక మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఆమె మృతిపై భర్త ఫణీంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవాళ సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ని కలిసి నిష్పక్షిపాతంగా దర్యాప్తు జరిపించాలని కోరారు. తన తోడల్లుడితో ఆర్థిక అంశాలతో వివాదం ఉంది అని.. దాంతో ఏమైనా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సుహారిక మే 28వ తేదీన అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండునెలల తర్వాత తన భార్య మృతిపై ఫణీంద్ర మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇంటికెళ్లి.. కుప్పకూలి...

ఇంటికెళ్లి.. కుప్పకూలి...

మే 28వ తేదీన తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సుహారిక అక్కడే కుప్పకూలిపోయింది. ఆమెను రాయదుర్గంలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సుహారిక చనిపోయిందని వైద్యులు తెలిపారు. మృతిని సస్పెక్టెడ్ డెత్ కేసుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాలు ఉన్నాయని ఫణీంద్ర మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో సుహారిక మృతిపై అనుమానాలు కలుగుతున్నాయి.

అనుమానాలివే..

అనుమానాలివే..

సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ని కలిసిన ఫణీంద్ర.. సుహారిక చనిపోయిన విధానంపై అనేక అనుమానాలున్నాయని తెలిపారు. తొలుత సీబీఐటీ వద్ద చనిపోయిందని చెప్పారని పేర్కొన్నారు. తర్వాత ఏఐజి హాస్పిటల్‌కి సమీపంలో ఉన్న బ్యాంబో హిల్స్ వద్ద మృతిచెందిందని చెప్పారన్నారు. సుహారిక మందు తాగే అలవాటు లేదని క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు ఏదో పార్టీ జరిగినట్టు ప్రచారం చేశారని పేర్కొన్నారు. సుహారిక మారథాన్ రన్నర్ అని.. ఆమెకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్నారు.

Recommended Video

    YSRCP MLA Ambati Rambabu Tested COVID-19 Positive,Video Gone Viral || Oneindia Telugu
     ఆర్థిక లావాదేవీలే కారణమా..?

    ఆర్థిక లావాదేవీలే కారణమా..?

    తోడల్లుడితో ఆర్థిక సమస్యలు ఉన్నాయని ఫణీంద్ర చెప్పారు. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం మాట్లాడేందుకు పిలిచారని తెలిపారు. కానీ తన భార్య మాత్రం విగతజీవిగా మారిందని పేర్కొన్నారు. ఇదే విషయం తన అత్తమామలకు కూడా చెప్పానని.. కానీ వారు అనవసరం అంటూ సమాధానం ఇచ్చారన్నారు. దీంతో తనకు అనుమానం కలుగుతోందని చెప్పారు. ఆ రోజు పార్టీకి వచ్చిన నలుగురు తప్పించుకు తిరుగుతున్నారని సజ్జనార్‌తో తెలిపారు. విచారణలో నిజ నిజాలు వెలికితీయాలని సీపీని ఫణీంద్ర కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+