హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాగర్‌లో ప్రత్యేక బోట్‌లో జీవించు-సాధించు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌ను 2015లో ఆత్మహత్య రహిత సాగర్‌గా చేయాలన్న లక్ష్యంతో లేక్ పోలీసులు పనిచేస్తున్నారని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మహత్యకు యత్నించి లేక్ పోలీసులు కాపాడిన వారితో నిర్వహించిన బాధితులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

సోమవారం హుస్సేన్‌సాగర్ జలాలపై ప్రత్యేక బోట్‌లో జీవించు సాధించు పేరుతో ఆత్మహత్యకు యత్నించిన 50 మంది బాధితులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప విలువైన జీవితాన్ని క్షణికావేశంలో చేజార్చుకోవద్దని సూచించారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

2010 నుంచి 2014 వరకు హుస్సేన్‌సాగర్‌లో 243 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అందులో 196 మంది పురుషులు, 47 మంది స్త్రీలు ఉన్నారని తెలిపారు. దశాబ్ద కాలంలో లేక్ పోలీసులు సుమారు 327 మందిని రక్షించారని, 2014లో 85 మందికి పునర్జన్మ ఇచ్చారన్నారు.

 ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

సోమవారం హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేక బోట్‌లో జీవించు-సాధించు పేరుతో ఆత్మహత్యకు యత్నించిన బాధితులకు కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

హుస్సేన్ సాగర్‌ను 2015లో ఆత్మహత్య రహిత సాగర్‌గా చేయాలన్న లక్ష్యంతో లేక్ పోలీసులు పనిచేస్తున్నారని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మహత్యకు యత్నించి లేక్ పోలీసులు కాపాడిన వారితో నిర్వహించిన బాధితులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

 ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

సోమవారం హుస్సేన్‌సాగర్ జలాలపై ప్రత్యేక బోట్‌లో జీవించు సాధించు పేరుతో ఆత్మహత్యకు యత్నించిన 50 మంది బాధితులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప విలువైన జీవితాన్ని క్షణికావేశంలో చేజార్చుకోవద్దని సూచించారు.

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

ఆత్మహత్యలకు పాల్పడిన వారిని రక్షించిన అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారి జీవితాల్లో మార్పుతేవడం జరిగిందని, ఇందుకు లేక్‌వ్యూ, రాంగోపాల్‌పేట్ ఇన్‌స్పెక్టర్లు జానకమ్మ, గంగారెడ్డిల కృషి అభినందనీయమన్నారు.

 ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

అనంతరం పోలీసులు రక్షించిన బాధితుల చేతులమీదుగా కేక్‌కట్ చేయించారు.

 ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

నిరుపేద కుటుంబంలో పుట్టినా కష్టపడి ఎంబీఏ వరకు చదివాను. నా కాళ్లపై నిలబడి నలుగురికి సహాయ పడాలనే తపనతో ఉన్న నాకు కుటుంబ సభ్యుల సహకారం లభించలేదు. భవిష్యత్తు శూన్యంగా కనిపించింది. ఈ నెల 19న సాగర్‌లో ఆత్మహత్యకు యత్నించాను. పోలీసులు రక్షించి కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

భర్త రోజు తాగి వచ్చి కొట్టేవాడు. నాకు ముగ్గురు పిల్లలు. బయట పనిచేస్తే అనుమానంతో చావబాదేవాడు. జీవితంపై విరక్తి కలిగింది. ఈ నెల 12న సాగర్ వద్దకు చేరుకొని ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించాను. గుర్తించిన పోలీసులు మమ్మల్ని రక్షించి ధైర్యం కల్పించారని చెప్పింది.

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

సాగర్‌లో ఆత్మహత్యకు యత్నించిన వారిని రక్షించిన కానిస్టేబుల్ నర్సింహతో పాటు బి. వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, వై. రమేశ్, జి. కృష్ణ, ఆంజనేయులును డీసీపీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించి ప్రశంసాపత్రాలను అందచేశారు.

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

ఆత్మహత్య రహిత సాగరే లక్ష్యంగా జీవించు-సాధించు

బుద్ధుడి విగ్రహం వద్ద ఆత్మైస్థెర్యాన్ని కల్పిస్తూ ప్రమాణం చేయించారు.

గతంలో లేక్ పోలీస్ స్టేషన్‌లో 16 మంది సిబ్బంది ఉండేవారని, ఇప్పుడు అదనంగా మరో 15 మందిని కేటాయించామని చెప్పారు. ఆత్మహత్యలు ఎక్కువగా ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్‌పై జరుగుతున్నందున గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.

ఆత్మహత్యలకు పాల్పడిన వారిని రక్షించిన అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారి జీవితాల్లో మార్పుతేవడం జరిగిందని, ఇందుకు లేక్‌వ్యూ, రాంగోపాల్‌పేట్ ఇన్‌స్పెక్టర్లు జానకమ్మ, గంగారెడ్డిల కృషి అభినందనీయమన్నారు.

అనంతరం ప్రముఖ మానసిక వైద్య నిపుణులు గంపా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ నగర పోలీస్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం మంచిదన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం కావాలి. ఒక వ్యక్తిని చంపడానికి మరో వ్యక్తి ఎంత ధైర్యం కూడగట్టుకుంటాడో దీనికి అంతే. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. సమస్యలు తాత్కాలికం అని అన్నారు.

మనిషి పూర్తిస్ధాయి ధైర్యంతో ఆలోచిస్తే ప్రపంచంలో అద్భుతాలు సాధించవచ్చు. ఈ విషయాన్ని ప్రతి వ్యక్తీ గుర్తించుకోవాలి. ఈ రోజు వ్చచిన ఆలోచన రేపు ఉండదు. రేపటి ఆలోచన ఎల్లుండి ఉండదు. అంటే రోజురోజుకీ ఆలోచనలు మారుతుంటాయని అన్నారు.

అనంతరం పోలీసులు రక్షించిన బాధితుల చేతులమీదుగా కేక్‌కట్ చేయించి, బుద్ధుడి విగ్రహం వద్ద ఆత్మైస్థెర్యాన్ని కల్పిస్తూ ప్రమాణం చేయించారు. సాగర్‌లో ఆత్మహత్యకు యత్నించిన వారిని రక్షించిన కానిస్టేబుల్ నర్సింహతో పాటు బి. వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, వై. రమేశ్, జి. కృష్ణ, ఆంజనేయులును డీసీపీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించి ప్రశంసాపత్రాలను అందచేశారు.

English summary
Kamal Hassan Reddy addressing in Suicide Attempts Victims -2014 who Save by Police in Awarnews Programme at Budda Statue, Hussansagar in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X