సులభ్ కాంప్లెక్స్ నే ఎత్తుకెళ్ళిన కేటుగాళ్ళు... షాకైన పారిశుధ్య కార్మికులు!!

హైదరాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏకంగా కొందరు ఘనులు పబ్లిక్ టాయిలెట్ ని చోరీ చేసి విక్రయించారు. కొందరు దొంగలు ఇళ్ళలో చోరీలకు పాల్పడితే, మరికొందరు చైన్ స్నాచింగ్ లకు పాల్పడతారు. కొందరు ఆలయాలనే టార్గెట్ చేస్తారు. అయితే ఊహించని విధంగా, అందరూ షాక్ అయ్యేలా హైదరాబాద్ నగరంలో పబ్లిక్ టాయ్ లెట్ లను టార్గెట్ చేశారు కొందరు దుండగులు. వాడకుండా నిరుపయోగంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్లను అక్కడి నుండి మాయం చేసి స్క్రాప్ కింద విక్రయిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఇక అటువంటి సంఘటనే సఫిల్ గూడా క్రాస్ రోడ్ లో జరిగింది.

సఫిల్‌గూడ క్రాస్‌రోడ్‌లో ఇనుప ఫ్రేమ్‌తో కూడిన సులభ్ టాయిలెట్ బాక్స్‌ను దొంగిలించి దానిని పాత సామాన్ల దుకాణంలో స్క్రాప్ గా విక్రయించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ జగదీశ్వరరావు, మల్కాజిగిరి సర్కిల్‌ వైస్‌ కమిషనర్‌ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సఫిల్‌గూడ చౌరస్తాలోని సులభ్‌ టాయిలెట్‌ బాక్స్‌ మార్చి 16న మాయమైంది. సులభ్ కాంప్లెక్స్‌ కనిపించకపోవడంతో పారిశుద్ధ కార్మికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.పబ్లిక్ టాయిలెట్ కనిపించకుండా పోయిన విషయాన్ని గమనించిన పారిశుధ్య కార్మికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అంతేకాదు పోలీసు అధికారులకు సులభ్ కాంప్లెక్స్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు . పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

sulabh toilet box stolen by three people in hyderabad.. police arrest

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన నిందితుడు మెదక్ జిల్లా అందోలు మండలం అమ్మసాగర్‌కు చెందిన ముప్పారం జోగయ్య(36)గా గుర్తించారు. జోగయ్య నేరాన్ని అంగీకరించి, జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో పనిచేసే అరుణ్‌కుమార్‌, జైన్‌ కన్‌స్ట్రక్షన్‌లో పనిచేసే మరో బిక్షపతి సాయంతో తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. ముషీరాబాద్ లో ఈ టాయిలెట్ బాక్స్‌ను రూ.45 వేలకు విక్రయించినట్లు నిందితులు తెలిపారు. టాయిలెట్ అమ్మిన సొమ్మును రికవరీ చేయడంతోపాటు, పోలీసులు జగన్ ను అరెస్ట్ చేసి జోగయ్యను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+