గోవిందా.. గోవింద.. ఆ రైళ్లు కూడా చర్లపల్లి నుంచే!
సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను దక్షిణ మధ్య రైల్వే గట్టిగా పిండుతోంది. ఏ ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలన్నా చర్లపల్లి నుంచే ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సికింద్రాబాద్ నుంచి, కాచిగూడ నుంచి, నాంపల్లి నుంచి, నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి చర్లపల్లికి ప్రత్యేకంగా బస్సుల సంఖ్యను పెంచేందుకు మాత్రం ప్రయత్నం చేయడంలేదు. మీ చావు మీరు చావండి.. అన్నట్లుగా అధికారుల వ్యవహారశైలి ఉందంటూ విమర్శలు వస్తున్నాయి.
లింగంపల్లి నుంచైనా నడపండి
వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో వచ్చేనెల 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు 44 ప్రత్యేక రైళ్లను చర్లపల్లి నుంచి ఏర్పాటు చేశారు. విశాఖపట్నం టు చర్లపల్లి (రైలు నెంబర్ 08579) రైలు జూన్ 6వ తేదీ నుంచి జులై 25వ తేదీ వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. అలాగే చర్లపల్లి టు విశాఖపట్నం (నెం. 08580) రైలు జూన్ 7వ తేదీ నుంచి జులై 26వ తేదీ వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటాయి. వీటిని సికింద్రాబాద్ నుంచి కానీ, లింగంపల్లి నుంచి కానీ, నాంపల్లి నుంచి కానీ నడిపితే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారుకానీ అధికారులు సికింద్రాబాద్ స్టేషన్ లో పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు.

విశాఖ నుంచి బెంగళూరుకు
జూన్ 4వ తేదీ నుంచి జులై 30వ తేదీ వరకు ప్రతి బుధవారం నెం.08547 రైలు విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు నడుస్తుంది. అలాగే తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు నడిచే రైలు నెం. 08548 రైలు జూన్ 5వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు ప్రతి గురువారం నడుస్తుంది. విశాఖపట్నం నుంచి ఎస్‌ఎంవీటీ బెంగళూరు (నెం. 08581)రైలు జూన్ 1వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఎస్‌ఎంవీటీ బెంగళూరు నుంచి విశాఖపట్నం (నెం.08582)రైలు జూన్ 2వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటాయి.












Click it and Unblock the Notifications