• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీ వినీలాకాశంలో వెలుగువెలిగిన సూపర్ స్టార్ కృష్ణ .. 340కిపైగా చిత్రాలు.. సాగించిన ప్రస్థానమిదే!!

|
Google Oneindia TeluguNews

ఆకాశంలో ఒక తార.. నాకోసం వచ్చింది ఈవేళ అంటూ ప్రేక్షకుల మనసులను ఉర్రూతలూగించిన సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. సినీ వినీలాకాశంలో తనదైన స్టైల్ లో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించిన సూపర్ స్టార్ కృష్ణ ఎవరికీ అందని అనంతలోకాలకు చేరిపోయారు.

సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు..

సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు..

తెలుగువీర లేవరా అంటూ అల్లూరి సీతారామరాజుగా తెలుగువారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణ సినిమా ప్రపంచాన్ని కన్నీటి సంద్రంలో ముంచి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తెలుగు సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం రోజు అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్ కు గురైన సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

బుర్రిపాలెం బుల్లోడికి సినిమాలంటే మొదటి నుండీ మక్కువ

బుర్రిపాలెం బుల్లోడికి సినిమాలంటే మొదటి నుండీ మక్కువ

1942 మే 31 వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి మండలం లోని బుర్రిపాలెం గ్రామంలో వీర రాఘవయ్య చౌదరి నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో కృష్ణని అందరి కంటే పెద్ద వాడు. సూపర్ స్టార్ కృష్ణ గా అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాల పైన ఎనలేని మక్కువ.తల్లిదండ్రులు కృష్ణ ఇంజనీరింగ్ చదివించాలని ఎంతగానో ఆశపడినా, కృష్ణ కు మాత్రం మొదటి నుంచి నీ నటన పైన ఎక్కువ ఆసక్తి ఉండేది.

 తేనే మనసులతో సినీ రంగ ప్రవేశం చేసిన సూపర్ స్టార్ కృష్ణ

తేనే మనసులతో సినీ రంగ ప్రవేశం చేసిన సూపర్ స్టార్ కృష్ణ

ఇంజనీరింగ్లో కృష్ణకు సీట్లు రాకపోవడంతో డిగ్రీ లో చేర్పించారు తల్లిదండ్రులు. ఏలూరు డిగ్రీ కళాశాలలో చదువుతున్న సమయంలో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కు ఘన సన్మానం జరగగా, ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాల పైన మరింత ప్రేమ పెరిగింది. దీంతో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సినీ రంగం వైపు అడుగుపెట్టిన కృష్ణ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు చేశారు. తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కృష్ణ 1967లో బాపు-రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమా లో కృష్ణ కథానాయకుడిగా నటించారు.

340 కి పైగా సినిమాలలో కృష్ణ సినీ ప్రస్తానం

340 కి పైగా సినిమాలలో కృష్ణ సినీ ప్రస్తానం

కన్నెమనసులు, గూడచారి 116, జేమ్స్ బాండ్, ఇద్దరు మొనగాళ్ళు, మరపురాని కథ, ఇలా కృష్ణ సినీ ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. పండంటి కాపురం, గాజుల కిష్టయ్య, దేవుడు చేసిన మనుషులు, మాయదారి మల్లిగాడు, మోసగాళ్లకు మోసగాడు వంటి చిత్రాలతో పాటు అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణ, నాలుగు దశాబ్దాలపాటు సాగిన తన సినీ కెరీర్లో 340 కి పైగా సినిమాలలో నటించారు. అల్లూరి సీతారామరాజు, సింహాసనం సినిమాలు ఆయనకు మరింత కీర్తిని తెచ్చిపెట్టాయి. తెలుగులో తొలి 70ఎంఎం సినిమా సింహాసనం సినిమా, స్కోప్ సినిమా అయిన అల్లూరి సీతా రామ రాజును నిర్మించిన అరుదైన ఘనత కృష్ణ సొంతం చేసుకున్నారు. మొత్తం 55 సంవత్సరాల సినీ కెరీర్లో కృష్ణ సినిమా ప్రపంచంలో సాధించిన విజయాలు ఎన్నో.. ఇక చివరిగా 2016 సంవత్సరంలో కృష్ణ శ్రీ శ్రీ అనే సినిమాలో నటించారు.

1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థ.. 16 సినిమాలకు దర్శకత్వం..

1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థ.. 16 సినిమాలకు దర్శకత్వం..

సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ ఆనాటి హీరోలలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా గుర్తింపు పొందారు.1970లో పద్మాలయా పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీసిన కృష్ణ దర్శకుడిగానూ 16 సినిమాలను తెరకెక్కించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణ కే దక్కింది. సినీ రంగంలో విశేష సేవలు అందించిన సూపర్ స్టార్ కృష్ణకు పలు పురస్కారాలు వరించాయి. 2009వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఆయనను వరించగా, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, ఫిలింఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం సూపర్ స్టార్ కృష్ణకు లభించాయి.

 రాజకీయాల్లోనూ కృష్ణ ప్రయాణం

రాజకీయాల్లోనూ కృష్ణ ప్రయాణం


సినీ జీవితంతో పాటు రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన కృష్ణ 1984వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పై అభిమానంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృష్ణకు సన్నిహితుడు కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో మరోమారు ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురికావడం తో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కృష్ణ రాజకీయాలలో ఎక్కువ కాలం నిలబడలేదు. కానీ సినిమా ప్రపంచంలో మాత్రం తనదైన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని, అందరి మనసులలో సూపర్ స్టార్ గా నిలిచిపోయారు. కళామతల్లికి ఎనలేని సేవ చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఆయన అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచి వెళ్లిపోయారు.

English summary
Superstar Krishna, who lit up the tollywood cinema, passed away today. Find out about his historical journey and career. He acted in more than 340 films.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X