తెలంగాణకు చుక్కెదురు: కృష్ణా జలలాపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీం
బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో కృష్ణా జలాల పంపకంపై బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌పీఎల్) దాఖలు చేసింది.
కృష్ణా జలాల వాటాలు న్యాయబద్ధంగా లేవని, మరోసారి పరిశీలించాలని కోరింది.
దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. మిగతా పిటిషన్లపై మాత్రం విచారణ కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

తాజా తీర్పును అమలు చేయవద్దని కోర్టును తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ తీర్పుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని వెల్లడించింది. కాగా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సైతం విన్నవించింది.












Click it and Unblock the Notifications