కోదండరామ్, అలీ ఖాన్ ఎమ్మెల్సీ పదవుల పై సుప్రీం స్టే..!!

సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. కోదండరామ్, అమీర్ ఆలీఖాన్ ఎమ్మెల్సీలు గా నియామకం పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడి ఉంటుందని వెల్లడించింది. తమ నియామకం చేపట్టకుండా.. ఈ ఇద్దరి ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించటం పైన బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణ న్యాయ స్థానం ఆదేశించారు.

దీని పైన హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో సుదీర్ఘ విచారణ జరిగింది. కాగా, ఈ రోజు కోదండరాం, ఆలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకం రద్దు చేస్తూ.. తుది తీర్పు కోసం సెప్టెంబర్ 17వ తేదీకి సుప్రీం కేసు వాయిదా వేసింది.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రావణ్, సత్యానారాయణ ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నాటి కేబినెట్ ఎంపిక చేసి సిఫారసు చేసింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గవర్నర్‌ కోటాలో కోదండరామ్‌, ఆమీర్‌ అలీఖాన్‌ నియామకమైన విషయం తెలిసిందే. ఇద్దరిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసింది. అయితే, దీన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ అప్పటి ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రావణ్‌, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయా పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు.. ఎమ్మెల్సీలుగా కోదండ రామ్‌, ఆలీఖాన్‌ ప్రమాణ స్వీకారాన్ని తప్పుపట్టింది. గతంలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నికపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Supreme court sensational orders over Kodanda Ram and Ali Khan appointment as MLC s

తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహత ధర్మాసనం స్పష్టం చేసింది. దీని పైన దాసోజు శ్రావణ్ స్పందించారు. పూర్తి వివరాలు వచ్చిన తరువాత స్పందిస్తానని.. ఆ ఇద్దరి ఎమ్మెల్సీల నియామకాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు రద్దు చేసిందని చెప్పుకొచ్చారు. దీంతో.. సుప్రీం వచ్చే నెల 17న ఇచ్చే తుది తీర్పుకు అనుగుణంగా ఈ ఇద్దరి ఎమ్మెల్సీల విషయంలో తదుపరి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+