తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బావను చంపేశాడు
హైదరాబాద్: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో బావను చంపిన బావమరిదిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాదులోని కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం - కాప్రా సర్కిల్ పరిధిలోని హెచ్‌బీకాలనీ, కైలాసగిరిలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటూ పోల్లేపాక శ్రీనివాస్(40) పెయింటింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండేవాడు.
కొంతకాలంగా పోల్లేపాక శ్రీనివాస్ భార్య మేఘామాల చిన్నాన్నా కొడుకు వరుసకు బావమరిది అయ్యే గుడిపోచగళ్ళ శ్రీనివాస్(36) అలియాస్ గణేష్‌ను తన వద్ద ఉంచుకొని పని కల్పించాడు. వరంగల్ జిల్లా మద్దురు మండలం లద్దనూర్ గ్రామానికి చెందిన మహిళతో వివాహం జరిపించాడు. అనంతరం కైలాసగిరిలోని తన బావ పోల్లేపాక శ్రీనివాస్ ఇంట్లోని పైపోర్షన్‌లో నిందితుడు శ్రీనివాస్ దంపతులు కిరాయికి దిగారు.
తన బావ పోల్లేపాక శ్రీనివాస్‌తో తన భార్య తో వివాహేతర సంబంధం పెట్టుకుందని జి. శ్రీనివాస్ అనుమానిస్తూ తీవ్రంగా వేధించేవాడు. వేధింపులు మరింత ఎక్కవ కావడంతో కైలాసగిరి ప్రాంతంలోని మరో అద్దె ఇంటికి మారారు. ఇల్లు మారినప్పటికి శ్రీనివాస్ మాత్రం తన బావపై అనుమానం పోలేదు. నిందితుడు జి.శ్రీనివాస్ భార్య వేధింపులు తట్టుకోలేక రెండు నెలల కిందట పుట్టింటికి వెళ్ళిపోయింది.

పలుమార్లు తన బావ పోల్లేపాక శ్రీనివాస్ ఇంటికి తరుచూ నిందితుడు శ్రీనివాస్ వస్తుండేవాడు. అదే పద్ధతిలో శుక్రవారం రాత్రి పోల్లేపాక శ్రీనివాస్ ఇంటికి అతను వచ్చాడు. ఇద్దరు కలిసి అర్ధ్దరాత్రి వరకు మద్యం తాగారు. అనంతరం పోలేపాక శ్రీనివాస్ నిద్ర పోయిన అనంతరం తెల్లవారుజామున నిందితుడు శ్రీనివాస్ అప్పటికే తన వెంట తీసుకువచ్చిన గొడ్డలితో పోలేపాక శ్రీనివాస్‌పై దాడి చేసి పారిపోయాడు.
కుటుంబ సభ్యులు రక్తం మడుగులో ఉన్న శ్రీనివాస్‌ను అసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని సోమవారం రైల్వే క్వోర్టర్స్ ప్రశాంత్‌నగర్‌లో ఉన్న శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.రాజీవ్‌నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద దాచి పెట్టిన గొడ్డలిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications