పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట: నగర బహిష్కరణ ఎత్తివేత
హైదరాబాద్: శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో యువతలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలపై నగర బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే.
పరిపూర్ణానంద స్వామిపై హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణపై స్టే విధిస్తున్నట్టు మంగళవారం ఉదయం హైకోర్టు ప్రకటించింది. తనపై బహిష్కరణ వేటు సరికాదని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు అది భంగం కలిగిస్తోందని పేర్కొంటూ.. పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

దీనిపై వాదోపవాదాలు విన్న తరువాత, ఆయన ఎక్కడైనా తిరగవచ్చని చెబుతూ, తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ బహిష్కరణ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications