బాబు గోగినేని వాళ్లకే ఆదర్శం, భావ ప్రకటన పేరుతో కించపరుస్తారా?: పరిపూర్ణానంద ఫైర్
హైదరాబాద్: హేతువాదిగా కొనసాగుతున్న బాబు గోగినేనిపై శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా మండిపడ్డారు. మతాల ఉనికిని దెబ్బ తీసే హక్కు ఎవరికీ లేదని, అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్న స్వామి.. బాబు గోగినేని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడేవారికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భావ ప్రకటన పేరుతో కించపరుస్తారా?
గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా దారుణమని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు కులాలు, మతాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడంతో కోట్లాది మంది హృదయాలు గాయపడ్డాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని కులాల ప్రాతిపదికన చూడకూడదని కత్తి మహేష్‌ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై కత్తి మహేష్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మతాల ఉనికి దెబ్బతీసేందుకే..
ఒక కులం తక్కువ కాదు, మరో కులం ఎక్కువ కాదని.. అన్ని కులాలు, మతాలు ఒకటేనని అన్నారు. అన్నిటికీ గౌరవం, మర్యాద, విలువలు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మతాల ఉనికిని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని, అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని అన్నారు.
Recommended Video


గృహ నిర్బంధంలోనే పరిపూర్ణానంద
కాగా, స్వామి పరిపూర్ణానంద మంగళవారం కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని స్వామి బస చేసిన నివాసం నుంచి ఆయన్ని పోలీసులు బయటకు రానివ్వడం లేదు. ఆ ఇంటి పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్వామిజీ ఇంటికి వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మీడియాతోపాటు ఇతరులెవ్వరినీ అనుమతించడం లేదు.

బీజేపీ ఎమ్మెల్సీని అడ్డుకున్న పోలీసులు
స్వామిజీని కలిసేందుకు వచ్చిన వారందరినీ పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. స్వామిని కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రామచందర్ రావును కూడా పోలీసులు లోనికి అనుమతించలేదు. పరిపూర్ణానందతో మాట్లాడి వెళతానని ఆయన కోరినప్పటికీ అంగీకరించలేదు.

హిందూ సంఘాల ఆగ్రహం
పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని రామచందర్ రావు మండిపడ్డారు. స్వామిజీని గృహ నిర్బంధం చేయడం సరికాదని అన్నారు. స్వామిజీకి కావాల్సిన న్యాయ సహాయం చేసేందుకు బీజేపీ తరపున సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా, స్వామి చేపట్టిన యాత్రకు పోలీసులు, ప్రభుత్వం అనుమతించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications