చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్ఫోసిస్ టెక్కీ హత్య, హైదరాబాద్ ఫోరెన్సిక్ సాయం: స్వాతి ఫోన్ మిస్

|
Google Oneindia TeluguNews

చెన్నై: నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో జరిగిన టెక్కీ స్వాతి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. స్వాతిని హత్య చేసిన వారు ఆమెకు తెలిసిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, నిందితుడి గురించిన పూర్తి ఆధారాలు మాత్రం ఇంకా లభించలేదని తెలుస్తోంది.

ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య: కీలక ఆధారం లభ్యం!ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య: కీలక ఆధారం లభ్యం!

దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ... ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని చెప్చెన్నై: నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో జరిగిన టెక్కీ స్వాతి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. స్వాతిని హత్య చేసిన వారు ఆమెకు తెలిసిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, నిందితుడి గురించిన పూర్తి ఆధారాలు మాత్రం ఇంకా లభించలేదని తెలుస్తోంది.

swathi murder chennai police blocked swathi facebook

దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ... ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని చెప్పారు. రెండు ఫుటేజీలను కూడా విడుదల చేశారు. ఓ సాక్షి ఫోటో పంపించారని, కానీ అందులో నిందితుడు సరిగా కనిపించడం లేదని చెప్పారు.

టెక్కీ స్వాతి హత్య: సమన్వయలోపంపై హైకోర్టు ఫైర్

మేం హైదరాబాద్‌కు చెందిన డిజిటల్ ఫోరెన్సిక్ సంస్థ సహకారం కోరామని చెప్పారు. స్పష్టమైన ఇమేజ్ కోసం హైదరాబాద్‌కు చెందిన సంస్థను సంప్రదించామన్నారు. సిసిటీవీ వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, చెన్నై పోలీసులు స్వాతి ఫేస్‌బుక్ పేజీని బ్లాక్ చేశారు.

స్నేహితుడ్ని విచారించిన పోలీసులు

స్వాతి స్నేహితుడిని పోలీసులు విచారించారు. ఆ తర్వాత అతడిని విడుదల చేశారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. అతను అనుమానితుడు కాదని, పదిపదిహేనేళ్లుగా స్వాతి అతనికి తెలుసునని, కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు విచారించామని చెప్పారు.

హత్య అనంతరం స్వాతి ఫోన్ కనిపించడం లేదని చెప్పారు. ఆమె కాల్ డిటెయిల్స్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే ఫేస్‌బుక్ పేజీ, మెయిల్స్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, నుంగంబక్కం రైల్వే స్టేషన్ వద్ద పలువురు ప్రయాణీకులు, సాఫ్టువేర్ ఇంజినీర్లు ఆదివారం కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.

English summary
The Chennai police investigating the brutal daylight murder of the 24-year-old Infosys employee Swathi suspect that the crime was committed by a stalker, who knew her daily routine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X