అట్టహాసంగా ఆవిర్బావ వేడుకలు.!సంబరాలకు మీరా కుమార్ ను ఆహ్వానించిన టీ కాంగ్రెస్.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ, 6 దశాబ్దాల ప్రత్యక రాష్ట్ర కాంక్షను కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తల్లి సోనియమ్మ నెరవేర్చారని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన చేస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేయబోతున్న కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన అన్నారు.
కేసీఆర్ విఫలం : తెలంగాణ పేరు చెప్పి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రజలను మోసం చేసారని, మోసపు మాటలతో మభ్యపెట్టే పథకాలతో దగా చేసి గద్దెను ఎక్కారని అన్నారు. పదేళ్ళలో ప్రజలు చంద్రశేఖర్ రావు మోసాలను గమనించారని, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం అంటూ అనేక పథకాల హామీ.ఇచ్చి మోసం చేసారని, ఇపుడు ప్రజలు చంద్రశేఖర్ రావు అసలు స్వరూపాన్ని గుర్తించారని, వచ్చే ఎన్నికలలో చంద్రశేఖర్ రావు ఆటలు సాగవని అన్నారు.


అనేక కార్యక్రమాలు రూపొందించిన టీపిసిసి : ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టీపిసీసీ నేతలు విజ్ఞప్తి చేసారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మహేష్ కుమార్ గౌడ్). జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా గాంధీ భవన్ కార్యక్రమాలు ఇలా ఉన్నాయన్నారు. ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ పతాకం ఆవిష్కరణ. 11.00 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు లోకసభ మాజీ స్పీకర్ శ్రీమతి మీరా కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పిస్తారు. 11.15 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.. ఈ పాదయాత్ర ను శ్రీమతి మీరా కుమార్ ప్రారంభిస్తారని మహేష్ కుమార్ వివరించారు.












Click it and Unblock the Notifications