వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక్కడి నుంచి బరిలోకి రేవంత్... టీకాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల తొలిజాబితా విడుదల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ప్రకటించింది. పలువురి పేర్లను పరిశీలించి వడపోత చేసి అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించనప్పటికీ విడుదల చేసిన తొలి జాబితాలో 8 మందికి స్థానం లభించింది. మిగిలిన 9 స్థానాలకు అభ్యర్థులను శనివారం ప్రకటించనుంది కాంగ్రెస్ అధిష్టానం.

T-congress releases first List of Loksabha candidates,Revanth in the first list

ఇక కాంగ్రెస్ విడుదల చేసిన తొలిజాబితాలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది అధిష్టానం. కొడంగల్‌ నియోజకవర్గం నుంచి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై ఓడిపోయారు. అయితే మహబూబ్ నగర్ ఎంపీగా రేవంత్ పోటీ చేస్తారనే వార్త ప్రచారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీలోకి దింపనుంది. ఇక గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచి ఈ మధ్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్న చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించింది.

టీడీపీ తొలిజాబితా విడుదల.. 126 అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనటీడీపీ తొలిజాబితా విడుదల.. 126 అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

ఇక కాంగ్రెస్ తొలి జాబితాలో 8 మందికి చోటు లభించింది . వారి వివరాలు ఇలా ఉన్నాయి

ఆదిలాబాద్: రమేష్ రాథోడ్

మహబూబాబాద్: బలరాంనాయక్

కరీంనగర్: పొన్నం ప్రభాకర్

మెదక్ : గాలి అనిల్ కుమార్

జహీరాబాద్: మదన్ మోహన్

చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మల్కాజ్ గిరి: రేవంత్ రెడ్డి

English summary
After careful examination Congress has released its first list of the contesting candidates from telangana for the upcoming Loksabha elections.In this list 8 candidates found place and congress working president Revanth reddy will be contesting from Malkajgiri Constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X