రతన్ టాటాతో అనుకున్నాం, కానీ...: టీ హబ్‌పై కెటిఆర్ (పిక్చర్స్)

హైదరాబాద్: యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు టీ హబ్‌ను ఏర్పాటు చేశామని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు. దిగ్గజ వ్యాపారవేత్త రతన్‌టాటాతో టీ హబ్‌ను ప్రారంభించాలని భావించినప్పటికీ ఆరోగ్య సమస్యల కారణంగా కార్యక్రమానికి రాలేనని సమాచారం ఇచ్చారని తెలిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాత టీహబ్ ఆవిష్కరణకు విచ్చేస్తానని టాటా హామీ ఇచ్చారని, త్వరలోనే టీ హబ్ ఆవిష్కరణ ఉంటుందని మంత్రి ప్రకటించారు.

దేశంలోని ఎన్నో స్టార్టప్‌లకు రతన్ టాటా ఫండింగ్ చేస్తూ వాటికి జవజీవాలు అందిస్తున్నారని అందుకే ఆయనతోనే ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులున్న హైదరాబాద్ కొంగొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలని కెటిఆర్ ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇండియా గాడ్జెట్ ఎక్స్‌పోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

వినూత్న ఆవిష్కరణలకు అవార్డులు ఇచ్చే ఎన్డీటీవీ రెండోసారి కూడా ఎక్స్‌పోకు వేదికగా హైదరాబాద్‌ను ఎంచుకోవడం అభినందనీయమన్నారు. అమెరికా, బార్సిలోనాలో జరిగే ఎక్స్‌పోలకున్న క్రేజ్ ఇండియా గాడ్జెట్ ఎక్స్‌పోకు ఉందని ప్రశంసించారు. అంతటి ప్రాధాన్యంగల ఎక్స్‌పోకు వేదికగా నగరం రెండోసారి ఎంపిక కావడం సంతోషకరమని కెటి రామరావు అన్నారు.

వేదికగా హైదరాబాద్

వేదికగా హైదరాబాద్

వినూత్న ఎక్స్‌పోలకు కేంద్రంగా మారుతున్న హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు సైతం వేదికగా మారాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.

ప్రభుత్వ కార్యక్రమాలు అనేకం

ప్రభుత్వ కార్యక్రమాలు అనేకం

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు తగ్గట్లు తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్‌దే ప్రముఖ స్తానం

హైదరాబాద్‌దే ప్రముఖ స్తానం

హైదరాబాద్‌ను ప్రముఖ స్థానంలో ఉంచేందుకు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగంలో పలు సంస్థలు దోహదం చేస్తున్నాయని మంత్రి తెలిపారు.

ఇన్నోవేషన్ - ఇంకుబేషన్ కేంద్రంగా..

ఇన్నోవేషన్ - ఇంకుబేషన్ కేంద్రంగా..

తాము హైదరాబాద్‌ను ఇన్నోవేషన్-ఇంక్యూబేషన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కెటిఆర్ అన్నారు.

వచ్చే మూడేళ్లలో..

వచ్చే మూడేళ్లలో..

వచ్చే మూడేళ్ల కాలంలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇస్తామని మంత్రి కెటి రామరావు చెప్పారు.

రెండోసారి ఇలా..

రెండోసారి ఇలా..

పానసోనిక్ ఇండియా, సౌత్ ఏషియా ఎండీ మనీష్ శర్మ మాట్లాడుతూ భారతదేశం తమకు అత్యంత ప్రధానమైన మార్కెట్ అని తెలిపారు. దేశంలో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మనీష్ శర్మ చెప్పారు.

కెటిఆర్‌పై ప్రశంసలు

కెటిఆర్‌పై ప్రశంసలు

ఎన్డీటీవీ ప్రతినిధి రాజీవ్ మఖానీ మాట్లాడుతూ హైదరాబాద్‌కు ఉన్న క్రేజ్‌ను పెంచేలా మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.

హైదరాబాద్ విశిష్టత దృష్ట్యానే..

హైదరాబాద్ విశిష్టత దృష్ట్యానే..

హైదరాబాద్ విశిష్టతల దృష్ట్యానే రెండో ఏడాది కూడా తాము ఈ నగరాన్ని ఎంపిక చేసినట్లు రాజీవ్ ముఖాని వివరించారు.

వివిధ రంగాలకు చెందినవారు

వివిధ రంగాలకు చెందినవారు

ఎక్స్‌పో ప్రారంభ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉత్పత్తులు, వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ ఎక్స్‌పో నాలుగురోజులపాటు కొనసాగనున్నది.

పెట్టుబడుల కోసం..

పెట్టుబడుల కోసం..

తలంగాణలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు 100 కంపెనీల సిఇవోలతో శుక్రవారంనాడే సమావేశం కానున్నట్లు కెటిఆర్ చెప్పారు.

ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్..

ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్..

ఎలక్ట్రానికి హార్డ్‌వేర్ పరిశ్రమ ఎదిగేందుకు వీలుగా ఎస్ఎంఇలకు ఉపయోగపడే విధంగా టెస్టింగ్, ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఐజిఇ చైర్మన్ జెఇ చౌదరి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

పాఠ్యప్రణాళికలో మార్పులు

పాఠ్యప్రణాళికలో మార్పులు

నైపుణ్యం గల మానవ వనరుల అభివృద్ధి కోసం కళాశాల పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలని చౌదరి సూచించారు.

ఎక్స్‌పోలో వీరంతా..

ఎక్స్‌పోలో వీరంతా..

ఈ ఎక్స్‌పోలో కెనాన్, మైక్రోమాక్స్, జియోనీ, పానాసోనిక్, డబ్ల్యుడిసి, మోటరోలా, బిఎండబ్ల్యు, మెర్సిడెస్ బెంజ్ సహా పలు కంపెనీలు పాల్గొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+