ఇవాంకా ట్రంప్‌కు తాజ్ ఫలక్‌నుమాలో డిన్నర్, మాదాపూర్‌లో బస

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ ఈ నెల 28, 29 తేదిల్లో హైద్రాబాద్‌లో పర్యటించనున్నారు. ఇవాంకా రాక కోసం హైద్రాబాద్‌లో బారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజ్ ఫలక్‌నుమాలో ఇవాంకాకు డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు.

ఇవాంకా పర్యటనను పురస్కరించుకొని భద్రతా ఏర్పాట్లపై అమెరికా అధికారులు , తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సందర్శించారు. ఈ ప్రాంతంలోని రోడ్డు మార్గాన్ని కూడ పరిశీలించారు.

Taj Falaknuma to become a fortress for Ivanka Trump's visit

హైద్రాబాద్‌లో జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్‌కు వస్తున్నారు.ఇవాంకా పర్యటన ముగిసేంతవరకు మాదాపూర్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌లో బస చేస్తారు.

ఇవాంకా కోసం దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కోసం 'ఆక్టోపస్‌' కూడా బరిలోకి దిగనుంది. ఇప్పటినుంచే ఫలక్‌నుమా పరిసర ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతు పనులు చేపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
During their visit to Hyderabad, Prime Minister Narendra Modi and Ivanka Trump, daughter of US President Donald Trump and White House adviser, will attend a dinner hosted at the Taj Falaknuma. Ms Trump will be visiting the city for two days on November 28 and 29 at the head of the US business delegation at the Global Entrepreneurship Summit. The dinner is being hosted on November 28, according to sources, and teams of the Intelligence Bureau, counterintelligence and Special Branch have fanned into the neighbourhood and slu-ms surrounding the hotel.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి