వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు ఝలక్: తెరాసలో చేరిన తలసాని, తీగల

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యుడు గంగాధర్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో బుధవారం తెరాసలో చేరారు.

మీర్‌పేటలోని తీగల కృష్ణారెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్, తీగల, తలసాని తదితరులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఢిల్లీ వెళ్తాం: తెలంగాణ టీడీపీ

Talasani joins TRS

తెలంగాణ రైతుల గోడును కేంద్రానికి వినిపించడానికి గురువారంనాడు ఢిల్లీ వెళ్లాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా తమతోపాటు ఢిల్లీ రావాలని ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమణ, సీనియర్‌ నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావు టీఆర్‌ఎస్‌ నాయకులకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రైతుల వెతల గురించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసలు పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. తమతో పాటు ఢిల్లీ వస్తే తమకు సంతోషమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిసి సాయం చేయాలని కోరదామని, రైతుల ప్రాణాలు కాపాడడానికి కలిసి పోరాడదామని వారు టిఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేశారు.

రైతుల ప్రాణాలు పోతుంటే ఇంకా తపడు ప్రకటనలతో మోసం చేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు రమణ, ఎర్రబెల్లి దయాకర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తపడు ప్రకటనలతో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను దగా చేస్తున్నదని, తెలంగాణ రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరదామని వారు కోరారు.

రైతులకు ఇబ్బంది కలుగుతుందంటే గతంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు వె య్యి కోట్లు ఏందండీ? పది వేల కోట్లు ఇవ్వాలని అన్నారని ఎర్రబెల్లి గుర్తు చేస్తూ ఇపుడు ముఖ్యమంత్రి అయ్యాక కనీసం వంద కోట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికిపడు కనీసం వంద కోట్లు ఇవ్వు అని ఆయనను అడుగుతున్నం అని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు.

English summary
Talasani Srinivas Yadav has joined in Telangana Rastra Samithi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X