Congress, CPI: పొడుస్తున్న పొత్తులు.. కాంగ్రెస్, సీపీఐ మధ్య చర్చలు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరుగుతోన్నాయి. అయితే బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని భావించిన వామపక్షాలకు కేసీఆర్ హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐతో పొత్తుకు కాంగ్రెస్ సుముఖత చూపుతోంది. ఏఐసీసీ దూత ఇప్పటికే సీపీఐ నేతలతో చర్చలు కూడా జరిపారు. తాము కోరిన అసెంబ్లీ సీట్లు ఇస్తే పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు సీపీఐ చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలతో సీపీఐ రాష్ట్ర నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు.
హుస్నాబాద్(ఉమ్మడి కరీంనగర్ జిల్లా), మునుగోడు(ఉమ్మడి నల్గొండ), బెల్లంపల్లి(ఉమ్మడి ఆదిలాబాద్), కొత్తగూడెం(ఉమ్మడి ఖమ్మ జిల్లా) స్థానాలు ఇవ్వాలని సీపీఐ పట్టుబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం సీపీఐకి రెండు సీట్లు ఇచ్చేందుకు సుమఖత వ్యక్తం చేసింది. హుస్నాబాద్(ఉమ్మడి కరీంనగర్ జిల్లా), మునుగోడు(ఉమ్మడి నల్గొండ) స్థానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా సీపీఐకి ఆఫర్ చేసింది.

అయితే కనీసం మూడు సీట్లన్న ఇవ్వాలని సీపీఐ కోరుతున్నట్లు తెలిసింది. హుస్నాబాద్ నుంచి చాడ వెంకట్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆక్కడ ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. హుస్నాబాద్ టికెట్ కోసం కాంగ్రెస్ లో పోటీ ఎక్కువగా ఉంది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి టికెట్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ సీపీఐకి సీటు కేటాయిస్తే.. వీరికి టికెట్ లేనట్లే. పొత్తుపై నేతల సహకరించాలని సీనియర్ నేతలు చెబుతున్నారు.
గతంలో కూడా కాంగ్రెస్ తో సీపీఐ పొత్తులు పెట్టుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, టీడీపీతో కలిసి మహాకూటమి బరిలోకి దిగి బంగపడ్డాయి. అప్పుడు వైరా (ఉమ్మడి ఖమ్మం), బెల్లంపల్లి, హుస్నాబాద్ నుంచి సీపీఐ పోటీ చేసింది. అయితే అప్పుడు పొత్తులపై చర్చించేందుకు చాలా సమయం తీసుకోవడం ప్రచారానికి ఇబ్బందులు ఎదురయ్యాయని సీపీఐ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ సీపీఎంతో పొత్త ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
-
కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. గులాబీ పార్టీ మూలాలపై గురి! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..!












Click it and Unblock the Notifications