తమిళనాట కేసీఆర్ బీఆర్ఎస్ బిగ్ ప్లాన్: రంగంలోకి ఎమ్మెల్సీ కవిత.. చేస్తుందిదే!!

ఎమ్మెల్సీ కవిత తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న శరత్ కుమార్ తో భేటీ అయిన కవిత ఈ నెల 10న చెన్నైలో ఓ సదస్సులో పాల్గొననున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్ చేసిన కేసీఆర్, సరిహద్దు రాష్ట్రాలలో తెలుగు వారికి పట్టున్న ప్రాంతాలను టార్గెట్ చేసి ఆయా ప్రాంతాలలో బీఆర్ఎస్ పట్టు పెంచుకోవడానికి దృష్టి సారిస్తున్నారు. చాప కింద నీరులా సైలెంట్ గా పార్టీని విస్తరిస్తూ ముందుకు వెళుతున్న కేసీఆర్ ఎవరికి అర్థం కాని రీతిలో, పార్టీ విస్తరణ పై దృష్టి సారించారు.

2024 ఎన్నికల లక్ష్యంగా కేసీఆర్ వ్యూహం

2024 ఎన్నికల లక్ష్యంగా కేసీఆర్ వ్యూహం

2024 ఎన్నికల లక్ష్యంగా, అన్ని రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలనే దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్ ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ద్వారా, అటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల దృష్టిని, చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతాల దృష్టిని ఆకర్షించారు. ఇక ఇటీవల నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సభ ద్వారా మహారాష్ట్రకు సంబంధించిన నాయకులను పార్టీలో చేర్చుకున్నారు.

ఇప్పటికే వివిధ రాష్ట్రాల దృష్టిని ఆకర్షించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కెసిఆర్, అనేక రాష్ట్రాల నుండి తమతో కలిసి వచ్చే నాయకులను బీఆర్ఎస్ తో కలిసి పని చేయాలని పిలుపునిస్తున్నారు.

తమిళనాడుపై ఫోకస్ చేస్తున్న బీఆర్ఎస్

తమిళనాడుపై ఫోకస్ చేస్తున్న బీఆర్ఎస్

దేశానికి తెలంగాణ ఒక దిక్సూచిగా ఉంటుందని, ఇక్కడ అమలవుతున్న పథకాలను అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని చెబుతున్న కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదంతో దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇక ఇదే తడవుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్ ని ప్రకటించిన కెసిఆర్ త్వరలో విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిదానంగా పావులు కదుపుతూనే, మరోపక్క తమిళనాడు రాష్ట్రంపై కూడా బీఆర్ఎస్ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

రంగంలోకి ఎమ్మెల్సీ కవిత

రంగంలోకి ఎమ్మెల్సీ కవిత

ఇప్పటికే ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూడా బీఆర్ఎస్ లో చేరారు. ఇక మహారాష్ట్రలోనూ పలువురు నాయకులను పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ మహారాష్ట్రలో ఎన్నికలు ఏవైనా సరే పోటీకి సై అంటున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న కెసిఆర్, ఎమ్మెల్సీ కవితను రంగంలోకి దింపుతున్నారు.

తమిళనాడు శరత్ కుమార్ తో మాట్లాడిన కవిత

తమిళనాడు శరత్ కుమార్ తో మాట్లాడిన కవిత

ఇప్పటికే తమిళనాడుకు చెందిన పలువురు నాయకులతో మాట్లాడుతున్న కవిత ఇటీవల తమిళనాడుకు చెందిన ఆలిండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ తో భేటీ అయ్యారు. కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్న శరత్ కుమార్ దేశ రాజకీయాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం వెనక ఉద్దేశం, లక్ష్యం, అజెండా వంటి అనేక అంశాలపై శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో మాట్లాడారు.

ఈనెల 10న చెన్నైకి.. ఆ సదస్సులో బీఆర్ఎస్ జాతీయ అజెండా

ఈనెల 10న చెన్నైకి.. ఆ సదస్సులో బీఆర్ఎస్ జాతీయ అజెండా

ఈనెల 10వ తేదీన 2024 ఎన్నికలపై చెన్నైలో ఒక ప్రముఖ వార్తాపత్రికకు చెందిన సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఇక ఈ సదస్సులో తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ తదితరులు హాజరుకానున్నట్టు సమాచారం.

ఈ సదస్సు వేదికగా బీఆర్ఎస్ పార్టీ అజెండా, ముందు ముందు జాతీయ రాజకీయాలలో బీఆర్ఎస్ పోషించనున్న పాత్ర, దేశ అభివృద్ధికి కెసిఆర్ ఆలోచనలు ఎమ్మెల్సీ కవిత అందరికీ తెలిసేలా చెప్పనున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలోనూ మార్పు తీసుకురావటానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చెయ్యబోతుందో కవిత చెప్పనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+