కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్య: 'ఫాంహౌస్‌లో పడుకుంటే సమస్య తీరుతుందా?'

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కరువుపై ప్రకటనలు చేసి ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లో కేసీఆర్ పడుకుంటే సమస్యలు తీరతాయా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. కరువు పర్యటనలో భాగంగా ఆయన సోమవారం నల్లగొండ జిల్లా తిప్పర్తికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు తాండవిస్తుంటే ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపట్టక పోవడం దారుణమన్నారు.

కరువు మండలాలను ప్రకటించి చేతులు దులిపేసుకున్నారని మండిపడ్డారు. కేవలంపై రాష్ట్రంలో ఏర్పడిన కరువుపై ప్రకటనలకే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని దుయ్యబట్టారు. విపక్ష ఎమ్మెల్యేలు కాంట్రాక్టులు తీసుకుని ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

tammineni veerabhadram criticized telangana chief minister kcr

ప్రభుత్వం ప్రతి మండలానికి కరువు సహాయం కింద రూ.10 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సీట్లు గెలవకపోయినా ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ సీపీఎం మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఈ నెల 23న తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడికి ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

కరువుతో ప్రజలు అల్లాడుతున్నారు: డి.కె.అరుణ

తెలంగాణలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయని, కానీ ఆ దిశగా ప్రభుత్వం ఎక్కడా చర్యలు చేపట్టడం లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి.కె.అరుణ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని విజిలెన్స్‌ మానటరింగ్‌ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరవుతో ప్రజలు అల్లాడుతుంటే మాట్లాడలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఎంతో మంది వలస పోతున్నారని... వలసలను నివారించేందుకు తగిన జాగ్రత్తలతో ఉపాధిహామీ పనులు చేపట్టాలని ఆమె కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+