సభలకు రండి: కెసిఆర్‌కు తానా ఆహ్వానం(పిక్చర్స్)
హైదరాబాద్: వచ్చే ఏడాది జూలైలో అమెరికాలోని డెట్రాయిట్‌లో నిర్వహించే ‘తానా' మహాసభలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును తానా ప్రతినిధులు ఆహ్వానించారు. తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేనితో పాటు జంపాల చౌదరి, మధు టాటా, తోటకూర ప్రసాద్, సతీష్‌లతో కూడిన ప్రతినిధి బృందం గురువారం ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు.
అమెరికాలోని తెలుగువారి భద్రతకు, సమస్యల పరిష్కారానికి, సాంస్కృతిక వికాసానికి తానా చేస్తోన్న కృషిని వారు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తానా ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించగా, తెలంగాణ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తానా తరఫున సహాయం చేయనున్నట్టు వారు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో చేపడతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వారికి వివరించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, టిఆర్‌ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

కెసిఆర్‌తో తానా ప్రతినిధులు
వచ్చే ఏడాది జూలైలో అమెరికాలోని డెట్రాయిట్‌లో నిర్వహించే ‘తానా' మహాసభలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును తానా ప్రతినిధులు ఆహ్వానించారు.

కెసిఆర్‌తో తానా ప్రతినిధులు
మోహన్ నన్నపనేనితో పాటు జంపాల చౌదరి, మధు టాటా, తోటకూర ప్రసాద్, సతీష్‌లతో కూడిన ప్రతినిధి బృందం గురువారం ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు.

కెసిఆర్‌తో తానా ప్రతినిధులు
అమెరికాలోని తెలుగువారి భద్రతకు, సమస్యల పరిష్కారానికి, సాంస్కృతిక వికాసానికి తానా చేస్తోన్న కృషిని వారు ముఖ్యమంత్రికి వివరించారు.

కెసిఆర్‌తో తానా ప్రతినిధులు
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తానా ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించగా, తెలంగాణ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తానా తరఫున సహాయం చేయనున్నట్టు వారు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications