టార్గెట్ రేవంత్ రెడ్డి; తెగేదాకా లాగుతున్న కాంగ్రెస్ సీనియర్లు.. రంగంలోకి ప్రియాంకా గాంధీ!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రచ్చ కొనసాగుతూనే ఉంది . తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తాడోపేడో తేల్చుకుంటామని చెబుతూ రేవంత్ రెడ్డిని బాహాటంగానే వ్యతిరేకిస్తూ తిరుగుబాటు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల వ్యూహాలకు చెక్ పెట్టడం కోసం రేవంత్ రెడ్డి ఊహించని స్టెప్ వేశారు. టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పని చేస్తున్న సీతక్క తో పాటు 12 మంది పార్టీ పదవులకు రాజీనామా చేసి తాము సాధారణ కార్యకర్తలుగా ఉంటామని తేల్చి చెప్పారు . కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ లో పనిచేస్తున్నా ఇంకా టిడిపి ఎక్కడిదని వారు ప్రశ్నించారు.

మరోమారు సీనియర్ల భేటీ

మరోమారు సీనియర్ల భేటీ


ఇంతా జరుగుతున్న కాంగ్రెస్ సీనియర్లు మాత్రం పట్టిన పట్టు విడవలేదు. పిసిసి చీఫ్ లక్ష్యంగా దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. బాహాటంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక ఇందులో పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఉన్నారు అంటే తిరుగుబాటు ఎంత బలంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరోమారు భట్టి నివాసంలో సీనియర్ నాయకులు అందరు భేటీ కాబోతున్నారు.

కాంగ్రెస్ అంతర్గత పోరుపై అధిష్టానం ఫోకస్.. రంగంలోకి ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ అంతర్గత పోరుపై అధిష్టానం ఫోకస్.. రంగంలోకి ప్రియాంకా గాంధీ

ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ లో చోటుచేసుకున్న పరిణామాలపై దృష్టి సారించిన హైకమాండ్ సీనియర్ నాయకులతో టచ్ లోకి వెళుతుంది. వారితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే కొందరిని ఢిల్లీకి పిలిచి మాట్లాడతారని సమాచారం. ఈ క్రమంలోనే ఏకతాటి పైన ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో మాట్లాడానని నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితిని చక్కదిద్దడం కోసం ప్రియాంక గాంధీ సైతం రంగంలోకి దిగినట్లు సమాచారం.

కాంగ్రెస్ పంచాయితీ చెయ్యటం ప్రియాంకా గాంధీకి అంత ఈజీ టాస్క్ కాదు

కాంగ్రెస్ పంచాయితీ చెయ్యటం ప్రియాంకా గాంధీకి అంత ఈజీ టాస్క్ కాదు

ఇప్పటికే కొంతమంది పార్టీ సీనియర్ నాయకులతో ప్రియాంక గాంధీ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో చోటు చేసుకున్న గొడవల పై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా ఫోకస్ పెట్టారు. ఏఐసిసి కార్యదర్శి నదీమ్ జావేద్ కు ఫోన్ చేసి సీనియర్లను సంప్రదించి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాలని మణిక్కం ఠాగూర్ సూచించారు. కానీ సీనియర్లు ఎవరూ నదీమ్ జావెద్ కు సరిగ్గా సమాధానం ఇవ్వలేదని సమాచారం. బాగా బలంగా టీపీసీసీ విషయంలో పట్టుదల మీద ఉన్న కాంగ్రెస్ సీనియర్లను బుజ్జగించటం ప్రియాంకా గాంధీకి అంత ఈజీ టాస్క్ కాదు.

ప్రియాంక గాంధీ ఏ మేరకు సక్సెస్ అవుతారు?

ప్రియాంక గాంధీ ఏ మేరకు సక్సెస్ అవుతారు?


ఇక తెలంగాణ రాష్ట్రంలో రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీని కలపడంలో రంగంలోకి దిగిన ప్రియాంక గాంధీ ఏ మేరకు సక్సెస్ అవుతారు? దేశ రాజధాని ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను పిలిచి ఈ వ్యవహారాన్ని సెట్ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, అసంతృప్త సీనియర్ నాయకులు ఏ విధంగా బుజ్జగిస్తారు? రేవంత్ రెడ్డి పై పీకల్లోతు కోపంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అధిష్టానం బుజ్జగింపులకు తలొగ్గుతారా? వంటి అనేక ప్రశ్నలు తాజా పరిణామాలతో ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ముసలం ఇప్పుడు యుద్ధరంగాన్ని తలపిస్తున్న క్రమంలో అధిష్టానం దిద్దుబాటులో భాగంగా ఏం చేయబోతుంది. ఎవరికి న్యాయం చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+