ఆదిభట్లలో అపాచీ హెలికాప్టర్ల విడిభాగాల తయారీ: పారికర్ శంకుస్థాపన(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థకు అంకురార్పణ జరిగింది. ఆదిభట్లలోని ఏరోస్పేస్ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో అపాచీ హెలికాప్టర్లకు సంబంధించిన ప్రధాన విడి భాగాలు తయారవనున్నాయి. ఈ తయారీ కేంద్రానికి శనివారం రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శంకుస్థాపన చేశారు. బోయింగ్ ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ల ఫ్యూస్‌లేజ్‌లు(ప్రధాన భాగం), ఇతర ఏరోస్ట్రక్చర్లు ఇక్కడ తయారు కానున్నాయి.
టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) వీటిని తయారు చేయనుంది. ఈ తయారీ కేంద్రం అందుబాటులోకి వస్తే ప్రపంచంలో ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ల ఫ్యూస్‌లేజ్‌లను తయారుచేసే ఏకైక యూనిట్ ఇదే అవుతుంది. అమెరికా, భారత్ సహా పలుదేశాల భద్రతా దళాలు అపాచీ హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి. అమెరికా రక్షణరంగంలో ఇవెంతో కీలకమైనవి కావడం గమనార్హం.
ఎయిర్‌స్ట్రక్చర్ల తయారీ, సమీకృత వ్యవస్థల అభివృద్ధిపై సహకరించుకోవడానికి సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు గతేడాది నవంబరులో బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్‌లు (టీఏఎస్‌ఎల్) ప్రకటించాయి. దీనికనుగుణంగా టీబీఏఎల్‌ను ఏర్పాటు చేశాయి. తయారీ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా రక్షణ మంత్రి పారికర్ మాట్లాడుతూ.. ఏరోస్పేస్, రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత సామర్థ్యం మరింతగా వృద్ధి చెందడానికి టీబీఏఎల్ కీలక మలుపని చెప్పారు.
పారికర్‌కు గవర్నర్ విందు: పాల్గొన్న మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ గౌరవార్థం రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శనివారం మధ్యాహ్నం విందునిచ్చారు. ఈ విందులో రాష్ట్రమంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని పలు రహదారులపై ఆంక్షల ఎత్తివేత గురించి గవర్నర్, కేటీఆర్‌లు చర్చించినట్లు తెలిసింది. ఆంక్షలను సడలించాలని వారు కోరగా సమస్యను త్వరలో పరిష్కరిస్తామని మనోహర్ పారికర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి శంకుస్థాపన
తెలంగాణలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థకు అంకురార్పణ జరిగింది. ఆదిభట్లలోని ఏరోస్పేస్ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో అపాచీ హెలికాప్టర్లకు సంబంధించిన ప్రధాన విడి భాగాలు తయారవనున్నాయి.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి పారికర్ శంకుస్థాపన
ఈ తయారీ కేంద్రానికి శనివారం రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శంకుస్థాపన చేశారు. బోయింగ్ ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ల ఫ్యూస్‌లేజ్‌లు(ప్రధాన భాగం), ఇతర ఏరోస్ట్రక్చర్లు ఇక్కడ తయారు కానున్నాయి.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి పారికర్ శంకుస్థాపన
టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) వీటిని తయారు చేయనుంది. ఈ తయారీ కేంద్రం అందుబాటులోకి వస్తే ప్రపంచంలో ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ల ఫ్యూస్‌లేజ్‌లను తయారుచేసే ఏకైక యూనిట్ ఇదే అవుతుంది. అమెరికా, భారత్ సహా పలుదేశాల భద్రతా దళాలు అపాచీ హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి. అమెరికా రక్షణరంగంలో ఇవెంతో కీలకమైనవి కావడం గమనార్హం.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి పారికర్ శంకుస్థాపన
ఎయిర్‌స్ట్రక్చర్ల తయారీ, సమీకృత వ్యవస్థల అభివృద్ధిపై సహకరించుకోవడానికి సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు గతేడాది నవంబరులో బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్‌లు (టీఏఎస్‌ఎల్) ప్రకటించాయి. దీనికనుగుణంగా టీబీఏఎల్‌ను ఏర్పాటు చేశాయి.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి పారికర్ శంకుస్థాపన
తయారీ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా రక్షణ మంత్రి పారికర్ మాట్లాడుతూ.. ఏరోస్పేస్, రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత సామర్థ్యం మరింతగా వృద్ధి చెందడానికి టీబీఏఎల్ కీలక మలుపని చెప్పారు.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి పారికర్ శంకుస్థాపన
‘ఏరోస్పేస్, రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో బలపడేందుకు ఈ కేంద్రం దోహదపడుతుంది. రక్షణరంగంలో మేకిన్ ఇండియా పురోగతికి ఇదో ఉదాహరణ. భవిష్యత్తులో బోయింగ్, టాటాల బంధం మరింత బలపడుతుంది. అపాచీ హెలికాప్టర్లకు సంబంధించిన ప్రధాన భాగాల తయారీవల్ల నైపుణ్యాలు పెరగడంతో పాటు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రంగంలో నైపుణ్యాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది'పారికర్ తెలిపారు.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి పారికర్ శంకుస్థాపన
ఆ దిశగా బోయింగ్‌తో చర్చలు జరుపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలను వెల్లడిస్తుంది' అని తెలిపారు.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి పారికర్ శంకుస్థాపన
మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఒకటి లేదా రెండు యుద్ధ విమానాలను రూపొందించి అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు వివరించారు. అపాచీ, చినుక్ ఒప్పందాల తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బోయింగ్.. అపాచీ ప్రధాన భాగాల తయారీని భారత్‌కు తరలించిందన్నారు.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి పారికర్ శంకుస్థాపన
దేశీయ ఏరోస్పేస్, రక్షణ తయారీ పరిశ్రమలో ఇది కీలక మైలురాయి అని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు చెప్పారు. ప్రధాని మోదీ నిర్ణయాలతో దేశంలో, తెలంగాణలో ఈ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి పారికర్ శంకుస్థాపన
ఎంతో కాలంగా ఈ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా ఉందన్నారు. బోయింగ్ ఇక్కడకు రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి పారికర్ శంకుస్థాపన
‘ఈ రంగంలోని అవకాశాలను ముందుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. పరిశ్రమకు అవసరమైన నిపుణులను సరఫరా చేయడానికి ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి త్వరలో ఏరోస్పేస్ నైపుణ్యాల అకాడమీని ఏర్పాటు చేయనున్నాం. ఇందులో ప్రపంచస్థాయి ఏరోస్పేస్ కంపెనీలు భాగస్వాములవుతాయి. ఏరోస్పేస్, రక్షణ ఉత్పత్తుల తయారీపై ఓ విధానాన్ని ప్రకటించనున్నాం. కొత్తగా మూడు ఏరోస్పేస్ పార్కులను నెలకొల్పనున్నాం' అని మంత్రి పేర్కొన్నారు.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి పారికర్ శంకుస్థాపన
ఈ ప్రాజెక్టు ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ, హైదరాబాద్‌ల ప్రాముఖ్యాన్ని మరింత పెంచుతుందని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఛైర్మన్ ఎస్.రామ్‌దొరై అన్నారు. అమెరికా వెళ్లి బోయింగ్‌తో చర్చలు జరిపి ఈ ప్రాజెక్టు ఇక్కడకు రావడానికి కేటీఆర్ చేసిన కృషి అభినందనీయమని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్ చెప్పారు.

హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి పారికర్ శంకుస్థాపన
మేకిన్ ఇండియా కార్యక్రమం చేపట్టిన తర్వాత భారత్ నుంచి బోయింగ్ విడిభాగాలను సమకూర్చుకోవడం రెట్టింపైందని, ప్రస్తుతం రోజుకు రూ.10 కోట్ల విలువైన విడిభాగాలు, పరికరాల సేకరణ జరుగుతోందని వివరించారు.

పారికర్‌కు గవర్నర్ విందు: పాల్గొన్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ గౌరవార్థం రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శనివారం మధ్యాహ్నం విందునిచ్చారు. ఈ విందులో రాష్ట్రమంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

పారికర్‌కు గవర్నర్ విందు: పాల్గొన్న మంత్రి కేటీఆర్
అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని పలు రహదారులపై ఆంక్షల ఎత్తివేత గురించి గవర్నర్, కేటీఆర్‌లు చర్చించినట్లు తెలిసింది. ఆంక్షలను సడలించాలని వారు కోరగా సమస్యను త్వరలో పరిష్కరిస్తామని మనోహర్ పారికర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Click it and Unblock the Notifications