వీధి రౌడీల్లా తెలుగు తమ్ముళ్లు, బూతులు(ఫోటోలు)

హైదరాబాద్: నగరంలో నిర్వహించిన మిని మహానాడులో తెలుగు తమ్ముళ్లు క్రమశిక్షణ తప్పారు. సభా వేదికపై పెద్దలున్నారన్న విషయాన్ని మరిచి వీధి రౌడిల్లా రెచ్చిపోయారు. నువ్వా నేనా అంటూ చొక్కాలు పట్టుకోవడంతో పాటు బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర పార్టీ ఎన్నికల పరిశీలకులు, మాజీ మంత్రులు రాములు, ఉమా మాధవరెడ్డిల అధ్యక్షతన సోమవారం జిల్లా పార్టీ ఆఫీస్‌లో నగర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 15 నియోజకవర్గాలకు సంబంధించి అభిప్రాయాలను సేకరిస్తున్న క్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కట్టా రాములు, రవి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ

మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ


ఈ క్రమంలోనే ఇరువురు ఒకరిపైఒకరు చేయి చేసుకున్నారు. ఈ ఇద్దరి మధ్య గొడవ ముదురుతున్న క్రమంలో నగర అధ్యక్షుడు కృష్ణాయాదవ్, పిన్నమనేని సాయిబాబ, ఎంఎన్ శ్రీనివాస్‌రావులు బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ గొడవ ముగిసిన కొద్ది సేపటికే మాజీ కార్పొరేటర్ అస్లాం వర్గీయులపై మలక్‌పేటకు చెందిన నేతలు దాడి చేశారు.

మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ

మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ


ఎంఐఎం పార్టీతో తిరుగుతూ పార్టీ కార్యాలయానికి ఎలా వస్తారంటూ మలక్‌పేట నేతలు అస్లాం వర్గీయుల తన్నడం, ముజఫర్ అలీ, కృష్ణాయాదవ్ జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతిపజేశారు.

మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ

మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ

ఈ రెండు సంఘటనలే కాదు అభిప్రాయ సేకరణ జరుగుతున్నంత సేపు అంబర్‌పేట, ముషీరాబాద్ నియోజకవర్గ నేతలు సవాల్-ప్రతిసవాల్‌లో రెచ్చిపోవడం పరిశీలకులు ఒకింత షాకుకు గురవ్వడం గమనార్హం.
 మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ

మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ

టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మొన్నటి వరకు నియోజకవర్గాలకే పరిమితమైన విభేదాలు ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయానికి తాకాయి. మలక్‌పేట, గోషామహల్, ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ప్రజాభిప్రాయ సేకరణలో భగ్గుమన్నాయి. ప్రధానంగా నగర అధ్యక్షుడి కృష్ణాయాదవ్‌కు వ్యతిరేకంగా ఈ విభేదాలు జరగడం గమనార్హం.

మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ

మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ


నగర టీడీపీ అధ్యక్షుడి కృష్ణాయాదవ్‌గా బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు గడవక ముందే ఆయనను మార్చాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. కృష్ణాయాదవ్ వ్యవహారశైలే దీనిక్కారణమనడం ఎలాంటి సందేహం లేదు.

మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ

మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ


సీనియర్ నేతలను కలుపుకుపోకుండా పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వివాదస్పద అధ్యక్షుడిగా ముద్ర పడడంతో మార్పు అనివార్యమని చంద్రబాబు భావించాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం ఐవీఆర్‌ఎస్ ద్వారా ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలను సేకరించిన అధినేత చంద్రబాబు, క్షేత్రస్థాయిలో అభిప్రాయాల కోసం నియోజకవర్గాల వారీగా ప్రజాభిప్రాయం కోరారు.

 మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ

మిని మహానాడులో తెలుగు తమ్ముళ్ల రచ్చ


ఈక్రమంలోనే పార్టీ ఎన్నికల పరిశీలకులు రాములు, ఉమామాధవరెడ్డి అభిప్రాయాలు సేకరించగా ఇందులో ముషీరాబాద్, మలక్‌పేట, సికింద్రాబాద్, సనత్‌నగర్, కార్వాన్, గోషామహల్ ముఖ్యనేతలతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, సాయన్న, సీనియర్ నేత విజయరామారావు, త్రిమెన్ కమిటీ సభ్యులంతా కృష్ణాయాదవ్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+