Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూబ్లీహిల్స్ బై పోల్ బరిలో టీడీపీ - అభ్యర్దిగా నందమూరి వారసురాలు..!?

తెలంగాణలో ఉప ఎన్నిక తప్పేలా లేదు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మరణం తో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీలు చర్చలు మొదలు పెట్టాయి. సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ కాపాడుకోవటానికి సెంటిమెంట్ అస్త్రం బయటకు తీస్తోంది. కంటోన్మెంట్ తరహాలోనే ఈ సీటులో పాగా వేయాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అనూహ్యంగా ఈ బైపోల్ లో టీడీపీ పోటీ చేయటానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలు జనసేనతో పాటుగా బీజేపీతో చర్చలు సాగుతున్నాయి. అభ్యర్ధి పైనా ఒక అంచనాకు వచ్చినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం.

మారుతున్న లెక్కలు
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తో జూబ్లీ హిల్స్ బైపోల్ పైన ప్రధాన పార్టీలు చర్చలు.. లెక్కలు మొదలు పెట్టాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అక్టోబర్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సెప్టెంబర్ లో షెడ్యూల్ విడుదల అవుతుందని అంచనా. కంటో న్మెంట్ సీటు తరహాలోనే జూబ్లీహిల్స్ స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఈ స్థానంలో పరిస్థితుల అధ్యయనం.. నిర్ణయాల కోసం పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, వివేక్ తో సీఎం రేవంత్ ఒక కమిటీ ఏర్పాటు చేసారు. 2009 లో ఏర్పాటు అయిన ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ మూడు సార్లు గెలిచారు. 2014 లో టీడీపీ నుంచి గెలవగా, ఆ తరువాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు. 2018,2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.

TDP Chances to contest in Jubilee hills by poll as discussions with BJP

పార్టీల కసరత్తు
ఖైరతాబాద్ నుంచి విడిపోయి 2009 లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటు అయింది. 2009 లో పీ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక, ఇప్పుడు బైపోల్ లో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓటింగ్ కీలకం. కాంగ్రెస్ - ఎంఐఎం మధ్య పోటీ పైన అంగీకారం కుదిరితే మొత్తం లెక్కే మారిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచే తమ పార్టీ అభ్యర్దిగా పోటీలో నిలపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సాధ్యం కాకుంటే మాజీ ఎమ్మెల్యే విష్ణుకు సీటు కేటాయించే ఛాన్స్ ఉంది. ఈ సారి అనూహ్యంగా టీడీపీ సైతం ఈ నియోజకవర్గంలో పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు.. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు.

TDP Chances to contest in Jubilee hills by poll as discussions with BJP

బరిలో టీడీపీ..!
గోపీనాథ్ మరణం సమయంలో ఏపీ మంత్రి లోకేష్.. మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏను తెలంగాణలోనూ విస్తరించాలనే ప్రతిపాదన ఉంది. త్వర లో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు జరుగుతున్న ఈ ఎన్నికతోనే పొత్తు ప్రారంభించాలనే ఆలోచన జరుగుతోంది. దీంతో,జూబ్లీహిల్స్ బైపోల్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధిని బరిలో నిలపాలని భావిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని పేరు పరిశీలనలో ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది.టీడీపీలో సుహాసిని క్రియాశీలకంగా ఉన్నారు. నందమూరి వారసురాలిగా సీటు ఇస్తే కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ సైతం ఇక్కడ నుంచి దీపక్ రెడ్డిని పోటీలో దింపాలని భావి స్తోంది. ప్రస్తుతం చర్చల స్థాయిలో ఉన్న ఈ ప్రతిపాదనల పైన మూడు పార్టీల అధినాయకత్వం చర్చించి.. తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదే జరిగితే హైదరాబాద్ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలు కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+