చిక్కుల్లో నామా: నగ్నచిత్రాలున్నాయని బెదిరిస్తున్నట్లు మహిళ ఆరోపణ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఓ మహిళ ఫిర్యాదు మేరకు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో నామాపైనే కాకుండా ఆయన తమ్ముడు నామా సీతయ్యై కూడా ఐపిసి 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. నగ్న చిత్రాలు ఉన్నాయని, వాటినిబయటపెడతానని తనను నాా బెదిరిస్తున్నారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. మూడు నెలల క్రితమే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదులో పోలీసులు జాప్యం చేశారనే విమర్శలు వస్తున్నాయి.

పోలీసులు జాప్యం చేయడంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. వెంటనే నామా నాగేశ్వరరావు, నామా సీతయ్యలపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

 దాడికి పాల్పడ్డారు.....

దాడికి పాల్పడ్డారు.....

ఆయన వద్ద తన నగ్న చిత్రాలు ఉన్నాయని బెదిరిస్తున్నారని, వాటిని బయటపెట్టి సమాజంలో తలెత్తుకోకుండా చేస్తానని నామా నాగేశ్వరర రావు బెదిరిస్తూ దాడికి కూడా పాల్పడ్డారని మహిళ ఆరోపించారు. తాను ఒంటరిగా జీవిస్తున్నానని, తనకు నామా నుంచి ప్రాణ హాని ఉందని ఆ మహిళ అంటున్నారు.

అప్పటి నుంచి మిత్రుడు....

అప్పటి నుంచి మిత్రుడు....

తనకు నామా నాగేశ్వర రావుతో 2103 నుంచి స్నేహం ఉందని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవారని ఆ మహిళ చెప్పింది. ఇందుకు సంబంధించి శనివారంనాడు మీడియాలో కథనాలు వచ్చాయి. గతంలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ నామాపై వేధింపుల కేసు పెట్టిందని, దానిపై నిలదీయడంతో తనపై వేధింపులు ప్రారంభించారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 ఆ మహిళతో మట్లాడా....

ఆ మహిళతో మట్లాడా....

కర్ణాటక మాజీ ఎమ్మెల్సీతో తాను మాట్లాడానని, నామా పెళ్లి పేరుతో ఆమెతో పాటు చాలా మంది మహిలను మోసం చేసినట్లుగా ఆమె చెప్పిందని బాధిత మహిళ చెప్పినట్లు సాక్షీ మీడియాలో వార్తాకథనం వచ్చింది. కర్ణాటక మహిళ ఢిల్లీ కోర్టులో కేసు కూడా పెట్టినట్లు చెప్పారు. దానిపై ప్రశ్నించడంతో నామా తనను టార్గెట్ చేసినట్లు తెలిపింది.

దాడికి దిగారు....

దాడికి దిగారు....

ఈ ఏడాది మే, జులై నెలల్లో నామా నాగేశ్వర రావుతో పాటు ఆయన సోదరుడు నామా సీతయ్య తన ఇంటికి వచ్చిన తనను దుర్భాషలాడారని, దాడికి దిగారని ఆ మహిళ ఆరోపించింది. నామా బెదిరింపులపై బాధితురాలు ఆగస్టు 10వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 25వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంటికి వచ్చి తనను దుర్భాషలాడిన వీడియోను కూడా ఫిర్యాదుకు జత చేసినట్లు ఆ మహిళ తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad Jubileehills police filed a case against Telugu Desam Party ex MP Nama Nageswar Rao and on his brother Nama Seethaiah based on a woman's compaint.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి