హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రగతిభవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్.. అరెస్ట్ చేసిన పోలీసులు..

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్టైలే వేరు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో, ప‌నుల‌తో వార్తల్లో ఉంటారు. తాజా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసేందుకు హైద‌రాబాద్‌లో అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌కు వచ్చారు. కేసీఆర్‌ను క‌ల‌వాలంటూ ప్రగతి భవన్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు జేసీని అడ్డుకున్నారు. అపాయింట్మెంట్ లేకుండా లోనికి అనుమతించేది లేదని స్ప‌ష్టం చేశారు.

 ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ద్ద హ‌ల్‌చ‌ల్..

ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ద్ద హ‌ల్‌చ‌ల్..

ప్రగతి భవన్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వారిపై జేసీ దివాకర్ రెడ్డి కోపంతో ఊగిపోయారు. హల్ చ‌ల్‌ చేస్తూ.. సీఎం కేసీఆర్‌ను కాకపోతే మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ పోలీసులతో జేసీ వాగ్వాదానికి దిగారు. ఎవరిని కలవాలన్నా అపాయింట్మెంట్ కావాలని పోలీసులు ఆయనకు సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. ఎంత సర్ది చెప్పినా జేసీ దివాకర్ రెడ్డి వినలేదు.. దీంతో చేసేది లేక పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

జేసీ దివాక‌ర్ రెడ్డి అరెస్ట్..

జేసీ దివాక‌ర్ రెడ్డి అరెస్ట్..


మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిని పంజాగుట్ట పోలీస్ సేష్టన్ కు తరలించారు. అనంతరం అక్కడ నుంచి జేసీని ఆయన నివాసానికి పోలీసులు తరలించారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో కూడా ఉన్న‌ప‌ళంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అదే సమయంలో సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో సమావేశమైన సంద‌ర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యాలు వివాదస్పదంగా మారాయి. తాజాగా ప్రగతి భవన్ వద్ద కేసీఆర్ కలిసేందుకు వచ్చి .. అనుమతించకపోవ‌డంతో అక్కడి పోలీసులపై వాగ్వాదానికి దిగుతూ హాడావుడి చేయ‌డం మరో సారి జేసీదివాకర్ రెడ్డి వార్తల్లోకి ఎక్కారు.

Recommended Video

Special Interview With Divya Vani On Cristmas Celebrations | Oneindia Telugu
జేసీకి అవ‌మానం..

జేసీకి అవ‌మానం..

అయితే జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు ఆక‌స్మాత్తుగా సీఎం కేసీఆర్‌ను ఎందుకు కలవడానికి వచ్చారన్న దానిపై రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. కాని కేసీఆర్ అపాయింట్మెంట్ లేకుండా ఉన్న‌ప‌ళంగా రావ‌డం వ‌ల్ల జేసీకి అవ‌మానం జ‌రిగింద‌ని చెబుతున్నారు. గ‌తంలో ప‌లుమార్లు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లతో తాము ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌దిలేని తెలంగాణ వ‌స్తాం.. రాష్ట్ర విభజ‌న‌తో రాయ‌ల‌సీమ వాసులం న‌ష్ట‌పోయామంటూ జేసీ దివాక‌ర్ రెడ్డి వ్యాఖ్య‌లు చేశారు. ఆస‌మ‌యంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల ఆగ్ర‌హానికి గురికావాల్సి వ‌చ్చింది. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చి ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద‌ పోలీసుల చేతుల్లో అవ‌మానానికి.. జేసీ గురైయ్యార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

English summary
Ex minister JC Divakar Reddy arrest at CM KCR House pragati bhavan in hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X