ఏపీ టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైద్రాబాద్లో అరెస్ట్, 'కుట్రచేశారు'
నకిలీ పత్రాలతో భూముల కబ్జాలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైద్రాబాద్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.
హైదరాబాద్:నకిలీ పత్రాలతో భూముల కబ్జాలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైద్రాబాద్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.అయితే ఈ కేసులో తనను కుట్రచేసి ఇరికించారని ఆయన ఆరోపించారు.
దీపక్ రెడ్డిపై హైద్రాబాద్ నగరంలో పలు భూ కబ్జా కేసులున్నాయి. వందల ఎకరాలను ఆయన అనుచరులు కబ్జాలో ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు దీపక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై భూ కబ్జాలకు సంబంధించిన ఆరు కేసులున్నాయి.

దీపక్ రెడ్డి భూ కబ్జాలపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. దీపక్ రెడ్డి మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి అల్లుడు. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
కుట్ర చేశారు
పథకం ప్రకారంగానే తనను ఈ కేసులో ఇరికించారని ఏపీ టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు.తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని చెప్పారు. త్వరలోనే అన్ని విషయాలు వెలుగుచూస్తాయన్నారాయన.
మరోవైపు తనను ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు.అంతేకాదు దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు దీపక్ రెడ్డి.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications