వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎత్తిపోతలపై చంద్రబాబు ఎత్తులు: వ్యతిరేకంగా రాజ్యసభకు సిఎం లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో ఎత్తు వేసినట్లు కనిపిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని అపేయాలని ఇటీవల ఆయన కేంద్ర జలసంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

తాజాగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ పాలమూరు ఎత్తిపోతల అనుమతి లేని ప్రాజెక్ట్ అని రాజ్యసభకు లేఖ పంపారు. ఎలాంటి అనుమతుల్లేని ప్రాజెక్టు పనుల విషయం జలవనరుల శాఖ దృష్టికి వచ్చిందా? ఆమోదం లేని ప్రాజెక్టును నిలిపివేయడానికి కేంద్ర జలవనరుల శాఖ తీసుకునే చర్యలేంటని సీఎం రమేష్ ప్రశ్నించారు.

CM Ramesh

మరోవైపు, తాము పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు అది అక్రమ ప్రాజెక్టు అంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్గాలంటున్నాయి.

సీఎం రమేష్ రాజ్యసభకు పంపిన ప్రశ్నకు తెలంగాణ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని టిఆర్ఎస్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర జలసంఘానికి చంద్రబాబు రాసిన లేఖకు వ్యతిరేకంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా బంద్ కూడా నిర్వహించారు.

English summary
It is said that Telugu Desam party MP CM Ramesh has written a letter to Rajyasbha opposing Telangana irrigation project Palamuru lift irrigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X