రేవంత్ వెంట నడిచెదేవరు: లెక్కలు వేస్తున్న టిడిపి, అదే జరిగితే భారీ మూల్యం?
Recommended Video

హైదరాబాద్:తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే తనతో పాటు ఎవరెవరిని పార్టీలో చేర్చుకొంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్‌తో ఆ పార్టీ ఇంకా తేరుకోలేదు. నష్టనివారణ చర్యలకు టిడిపి నాయకత్వం ప్రారంభించింది.
రాజకీయంగా భవిష్యత్ లేకపోవడం, పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలు పార్టీని తీవ్ర ఇబ్బందుల పాల్జేసింది. దరిమిలా పార్టీని వీడాలనే అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
అక్టోబర్ 20, తేదిన తెలంగాణ ముఖ్య నేతల సమావేశం నిర్వహించాలని తెలంగాణ టిడిపి నిర్ణయం ీసుకొంది. అయితే కాంగ్రస్ పార్టీలో చేరుతానని వస్తోన్ ప్రచారంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

రేవంత్ పార్టీ వీడితే ఆయనతో వెళ్లేవారెందరు?
రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైందనే ప్రచారం నేపథ్యంలో ఆయనతోపాటు కాంగ్రెస్ కండువాలు ఎవరెవరు కప్పుకుంటారనే అంశంపైనే ప్రధానంగా చర్చంతా జరుగుతోంది. బుధవారం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడటం, ఏపీ మంత్రులు, నాయకులపై విమర్శలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తే.. ఆయన కాంగ్రెస్‌కు చేరువ కావడానికి మానసికంగా సిద్ధమైపోయారని అంటున్నారు. ఆయన వెంట ఎంత మంది వెళ్తారన్న విషయం చర్చనీయాంశమవుతోంది. అయితే నష్టనివారణకు టిడిపి ప్లాన్ చేస్తోంది. రేవంత్‌తో పార్టీని వీడాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

సగం జిల్లాల అధ్యక్షులంతా రేవంత్ వెంటే
ఒకవేళ తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనతో పాటు మెజారిటీ నేతలు కొందరు అభిప్రాయపడున్నారు.పార్టీ మారేందుకు రేవంత్‌తో టచ్‌లో ఉన్న నేతలెవరనే విషయమై చర్చిస్తున్నారు.. రేవంత్ పార్టీ మారినా,... నష్టం వాటిల్లకుండా ఉండేందుకుగాను పార్టీ ముఖ్యుల సమావేశం నిర్ణయించారు.రేవంత్‌తో టచ్‌లో ఉన్న నేతల జాబితాను సిద్దం చేస్తున్నారని సమాచారం.

టిడిపిలో వర్గాలు
ఏడాది కిందటే టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయని అంటున్నారు.. పార్టీ శ్రేణుల్లో అత్యధికులు రేవంత్‌ను అధ్యక్షుడిగా చేయాలని అభిప్రాయ సేకరణలో చెప్పినా, చంద్రబాబు ఎల్.రమణనే అధ్యక్షుడిగా ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీలో ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. ఇటీవల ప్రకటించిన జంబో కార్యవర్గంలో సైతం రేవంత్ వర్గానికి చెందిన కొందరికి పదవులు దక్కలేదు. ఆయన చేపట్టే కార్యక్రమాలకు, తీసుకునే నిర్ణయాలకు ఎప్పుడూ కొందరు సీనియర్లు అడ్డుపడుతున్నారని రేవంత్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా ఓపిక పట్టిన వారంతా పార్టీని వీడాలని ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం.

.టిఆర్ఎస్‌తో పొత్తుకు బాబు సానుకూలమా?
. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు కొందరు తెలంగాణ నేతలు చంద్రబాబుపై వీరే ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. రేవంత్ వెంట ఉన్నారని ప్రచారం జరుగుతున్న జిల్లాల టీడీపీ అధ్యక్షులంతా ఇటీవల సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని వాదించారని, కానీ చంద్రబాబు ఆలోచన మరోలా ఉండటంతో టీడీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదన్న నిర్ణయానికి వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications