కేసీఆర్‌పై టీడీపీ, మావి ఆంధ్రకూ ఉపయోగం: నాయిని
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని తెరాసలో చేర్చుకునేందుకు ఎంతకు కొన్నారో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణలు బుధవారం డిమాండ్ చేశారు.
గతంలో తెరాస ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు సంతలో పశువులను కొన్నట్లు, అడ్డా కూలీలకు డబ్బులిచ్చినట్లు ఇచ్చి చేర్చుకున్నారని కేసీఆర్ ఆరోపించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తెరాస ఎంతకు కొంటుందో చెప్పాలన్నారు.
టీడీపీని చూస్తే కేసీఆర్‌కు భయమని చెప్పారు. దమ్ము, ధైర్యం ఉంటే తెరాసలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే దైర్యం ఉందా అని ప్రశ్నించారు. తెరాసలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఈ నెల 24వ తేదీన ధర్నా చేస్తామని చెప్పారు.
టీడీపీ గల్లంతు: నాయిని

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గల్లంతేనని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తెరాసలో చేరుతున్నారని చెప్పారు. టీడీపీ ఆంధ్రా పార్టీ అన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన శక్తి సామర్థ్యాలను ఆంధ్రలో ఉపయోగించుకుంటేనే మంచిదన్నారు.
ఇక్కడ ఏం చేసినా ఆ పార్టీని ప్రజలు నమ్మరని చెప్పారు. మిత్రపక్షమైన మజ్లిస్‌తో మిత్రుల్లాగే ఉంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు ఆంధ్ర ప్రజలకు, ఉద్యోగులకూ ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతో ఏపీ కూడా ఇచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications