టీచర్లకు చేదువార్త: వారికి ఇక ప్రమోషన్లు లేనట్లే!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల(Teachers) పదోన్నతులు ప్రస్తుతానికి ఆగిపోయినట్లేనని తెలుస్తోంది. పదోన్నతి పొందాలన్నా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) తప్పనిసరి అని కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడం, టెట్‌ ఉత్తీర్ణులై.. పదోన్నతి పొందేందుకు అర్హులైన వారి సీనియారిటీ జాబితా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో స్కూల్‌ అసిస్టెంట్లుగా, గెజిటెడ్‌ హెచ్ఎంలుగా పదోన్నతులకు బ్రేక్‌ పడినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ పరిస్థితుల్లో పదోన్నతులపై ముందుకెళ్లడం సాధ్యం కాదని విద్యాశాఖ అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి. కాగా, ఉపాధ్యాయులుగా నియమితులు కావడంతో పాటు, పదోన్నతులకూ టెట్‌ ఉత్తీర్ణతను తప్పనిసరిచేస్తూ కేంద్రం 2010లో చట్టం చేసింది. ఆ ప్రకారం జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆ ఏడాదే నిబంధనలు విడుదల చేసింది. అయితే, తాజా పదోన్నతుల్లో ఆ నిబంధనలను పాటించాలంటూ కొందరు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Teachers promotion may Postponed in Telangana state, due to some issues

ఈ క్రమంలోటెట్‌ పాసై ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్నవారి సీనియారిటీ జాబితాను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కష్టమని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా, ఇప్పటికే మల్టీ జోన్‌-1తో పాటు మల్టీ జోన్‌-2 పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 1,218 మంది స్కూల్‌ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా పదోన్నతి దక్కింది. ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. అనంతరం అక్టోబరు 2 తర్వాత ఎస్​జీటీలకు, స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. తాజాగా, చోటు
చోటు చేసుకున్న పరిణామాలతో ఈ ప్రక్రియ జరగక పోవచ్చని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఈ పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కావడానికి మరో 5 రోజులు సమయం ఉన్నందున ఆలోపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. కాగా, అక్టోబరు 2 నుంచి యథావిధిగా ప్రక్రియ ప్రారంభమై.. టెట్‌ లేకుండా పదోన్నతులు ఇస్తే 2,162 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరో 5,870 మంది స్కూల్‌ అసిస్టెంట్లు అయ్యేవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+