అమరులే స్పూర్తి, మరో రెండు కొత్త పథకాలు, ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ కెసిఆర్ ఆగ్రహాం
ఏర్పడిన మూడేళ్ళలోనే ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. 17.82 ఆదాయ వృద్దిరేటుతో తెలంగాణ దూసుకుపోతోందన్నారు.
హైదరాబాద్: ఏర్పడిన మూడేళ్ళలోనే ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. 17.82 ఆదాయ వృద్దిరేటుతో తెలంగాణ దూసుకుపోతోందన్నారు. ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ ఏర్పాటైందో ఆ దిశగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ఆవిర్భావదినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు కొత్తకార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు.
అంతకుముందు ఆయన గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించారు. అక్కడి నుండి నేరుగా ఆయన పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు.
అనంతరం వివిధ విభాగాల్లో అత్యంత నైపుణ్యాన్ని, ప్రతిభను కనబర్చిన వారికి తెలంగాణ సిఎం కెసిఆర్ అవార్డులు అందజేశారు. రాష్ట్ర సాధన కోసం అమరులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని ఆయన గుర్తుచేశారు.

ఆదాయంలో అగ్రగామి
తెలంగాణ రాష్ట్రం ఆదాయంలో అగ్రగామిగా ఉందని కెసిఆర్ చెప్పారు. 17.82 ఆదాయవృద్దిరేటుతో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మూడేళ్ళలోనే 17.82 ఆధాయ వృద్దిరేటుతో దూసుకుపోతోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.అభివృద్ది ఫలాలను అట్టడుగు ప్రాంతాలను తీసుకెళ్ళడంలో ముందుకెళ్తున్నట్టు చెప్పారు కెసిఆర్ .రాష్ట్ర సాధన కోసం అమరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నట్టు చెప్పారాయన.ఏ ఆశయం కోసం , ఆశయాలను , ఆకాంక్షలను నేరవేర్చుకొనే దిశగా పురోగమిస్తున్నట్టు చెప్పారు కెసిఆర్. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు.

మరో రెండు పథకాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
తెలంగాణ ఆవిర్భావదినోత్సవంనాడు మరో రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాలకు కెసిఆర్ శ్రీకారంచుట్టారు. ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఒంటరి మహిళలకు ప్రతినెలా వెయ్యిరూపాలను, గర్భం దాల్చిన మహిళలకు కెసిఆర్ కిట్లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు.ఒంటరి మహిళలకు ప్రతి నెలా వెయ్యి రూపాయాల జీవనభృతిని కల్పిస్తున్నాం. మాతా శిశుసంరక్షణ కెసిఆర్ లు అమలుచేస్తున్నాం. గర్భం దాల్చిన మహిళలకు కూలీకి వెళ్ళకుండా ఉండేందుకు కెసిఆర్ కిట్స్ ప్రారంభిస్తున్నాం. గర్బిణీలకు 12 వేలు, ఆడపిల్ల అయితే 13 వేలను ఇవ్వనున్నట్టు చెప్పారు. బ్రూణ హత్యలను నిరోధించేందుకుగాను ఈ కిట్ ను అందిస్తాం. మూడు మాసాలలకు అవసరమైన వస్తువులను అందిస్తాం. ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావదినోత్సవం రోజు మరో రెండు పథకాలకు శ్రీకారంచుట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రెండు పథకాలను శుక్రవారం నుండి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

వ్యవసాయాన్ని పండగ చేస్తాం
వ్యవసాయాన్ని దండగ కాదు, పండగ అనేలా చేస్తామని కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా మారనున్నాడని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది నుండి ప్రతి ఏటా రెండు పంటలకు రైతులకు పెట్టుబడులను ప్రభుత్వమే చెల్లించనున్నట్టు ప్రకటించారు ముఖ్యమంత్రి. అంతేకాదు రానున్న రబీసీజన్ నుండి వ్యవసాయానికి 24 గంటలపాటు పాటు విద్యుత్ ను అందిస్తామన్నారు. రైతులతో క్రాప్ కాలనీలను ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకుగాను ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయవిస్తరణ అధికారులను నియమించాం. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రైతు సంఘాల సమాఖ్యను ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. ఏ గ్రామంలో ఏ రైతు ఏ పంట వేయాలి, ఎక్కడ ఏ పంట వేస్తే ప్రయోజనంగా ఉంటుందనే విషయాలను రైతులకు రైతు సంఘాల సమాఖ్యలు వివరించనున్నట్టు చెప్పారు. రైతు సంఘాల సమాఖ్యకు రూ.500 కోట్లను కేటాయిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించేందుకు ఈ సమాఖ్య పనిచేస్తోందన్నారు.టెక్నాలజీని రైతులకు అందించేందుకు ఈ సంఘాలు విశేషంగా ప్రయత్నిస్తాయని సిఎం చెప్పారు.

ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కొన్నిశక్తుల ప్రయత్నం
రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.అయితే ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కొన్నిశక్తులు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అయినా ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపకుండా ముందుకు వెళ్తున్నట్టు కెసిఆర్ చెప్పారు. ప్రతి ఏటా ప్రాజెక్టుల నిర్మాణం కోసం 25వేల కోట్లను ఖర్చుచేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. విద్యుత్ కొరతను సమర్థవంతంగా అధిగమించినట్టు చెప్పారు. రానున్నరోజుల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుస్తోంది. రానున్న రబీ సీజన్ నుండి 24 గంటలపాటు విద్యుత్ ను అందిస్తాం. మిషన్ భగీరథను పూర్తిచేసుకొంటే ప్రజలకు మంచినీటి కష్టాలు తీరుతాయి. రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.

టీఎస్ ఐ పాస్ లో ద్వారా పెట్టుబడులు
టీఎస్ ఐ పాస్ పథకం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తినిచూపుతున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఈ పథకాన్ని కేంద్రంతో పాటు విదేశాల్లోని పారిశ్రామికవేత్తలు కూడ ప్రశంసలు కురిపించారని ఆయన గుర్తుచేశారు. ఐటీ రంగంలో పెట్టుబడులు,. ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. హరితహరంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు వ్యవసాయాన్ని అభివృద్ది చేస్తామన్నారు. అనుబంధ వృత్తులను కూడ పరిపుష్టం చేస్తామని చెప్పారు.

కులవృత్తులకు ప్రోత్సాహం
కులవృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొందన్నారు. చేతివృత్తిదారులకు బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్టు చెప్పారు.బడ్జెట్ కేటాయింపులు చేశాం. గొర్రెల పెంపకం 35 సబ్సిడీతో గొర్రెల కాపరుల మెంబర్ షిప్ సాగుతోంది. 5 వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం.సేంద్రీయ ఎరువుల అవసరం తీరుతోంది. మాంసం ఎగుమతి చేసే అవకాశాలున్నాయి.చేపల పెంపకానికి అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వమే తీసుకొంటోంది. నవీన క్షౌరశాలల ఏర్పాటుకు లక్ష, రజకులకు పరికరాలు, కల్లుగీత వృత్తిని పెంచేందుకు ఈత, గీత చెట్లు పెంచుతున్నట్టు కెసిఆర్ చెప్పారు. ప్రత్యామ్యాయవర్గాల కోసం మారాలని భావిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications