విద్యన్న వెళ్లిపోయిండని!.. కంటతడి పెట్టుకున్న కేసీఆర్..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ జలయోధుడు విద్యాసాగర్ రావు మరణం సీఎం కేసీఆర్ ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించే సమయంలో కేసీఆర్ పొంగుకొస్తున్న దు:ఖాన్ని అనుచుకున్నారు. భావోద్వేగానికి గురవుతూ కంటతడి పెట్టుకున్నారు.

KCR

'తెలంగాణను కోటి ఎకరాల మాగణంలా' చూడకముందే విద్యాసాగర్ రావు మరణించడం తీరని ఆవేదనను మిగిల్చిందని కేసీఆర్ వాపోయారు.నీళ్ల విషయంలో తెలంగాణకు ఆయన పెద్దన్నలా వ్యవహరించారని అన్నారు.కేసీఆర్ తో పాటు మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్, హరీశ్ రావు, ఎంపీ కవిత ఆయన భౌతిక కాయానికి నివాళుల అర్పించారు.

గ్రావిటీ పరంగా తెలంగాణకు నీళ్లు ఎలా తీసుకురావచ్చంటూ గంటల తరబడి ఆయన చేసిన విశ్లేషణలు జీవితంలో మరిచిపోలేని క్షణాలని శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ.. విద్యాసాగర్ రావు మరణం రాష్ట్రానికి తీరని లోటు అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి నీళ్లపై ఉన్న హక్కులను వివరించే సలహాదారుగా.. అత్యంత సమగ్రమైన ప్రణాళిక కలిగిన వ్యక్తి విద్యాసాగర్ రావు అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజానీకానికి నీళ్ల ఆవశ్యకత గురించి వివరించిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు అని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు.

కాగా, ఆదివారం నాడు విద్యాసాగర్ రావు గారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం స్వగృహంలోనే ఉంచారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM KCR teared after seeing Vidyasagar Rao's dead body at his home. He said telangana missed a great person who have well knowledge on telangana irrigation

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి