వరంగల్ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ టెక్కీ
వరంగల్: హైదరాబాదుకు చెందిన ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ వరంగల్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటున్న జ్ఞానేశ్వర్ ఈ నెల మూడో తేదీన మధ్యాహ్నం నక్కలగుట్టలోని ఓ హోటల్‌కు వచ్చారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో డిన్నర్ చేశాడు.
తర్వాత గదికి వెళ్లాడు. తనను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని చెప్పాడు. శనివారం మధ్యాహ్నం గది నుంచి వాసన రావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి తలుపు తీసి చూడగా అతను ఆత్మహత్య చేసుకొని కనిపించారు.

పక్కనే సూసైడ్ నోట్ రాసి ఉంది. అందులో పోన్ నెంబర్ ఉంది. దాని ఆధారంగా పోలీసులు అతని తండ్రికి సమాచారం ఇచ్చారు. అతని తండ్రి హైదరాబాదులోని మణికొండలో ఉంటున్నారు. సాఫ్టువేర్ ఇంజినీర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications