కాళ్లు నరికి ప్రయోగం చేశారు: టెక్కీ నిఖిల్ తండ్రి నిరసన

హైదరాబాద్: తన కుమారుడు నిఖిల్ రెడ్డిపై గ్లోబల్ ఆస్పత్రి వైద్యుడు చంద్రభూషణ్ రెడ్డి ఓ ప్రయోగం చేశారని ఆయన తండ్రి గోవర్దన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎత్తు పెంపు పేరుతో ఆరోగ్యంగా ఉన్న తన కుమారుడి కాళ్లు నరకడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని ఆయన అన్నారు.

ఇటీవల గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెంపు కోసం శస్త్రచికిత్స చేయించుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డిని డిశ్చార్జీ చేశారు. నిఖిల్ ఆరోగ్యం మెరుగు పడడంతో డిశ్చార్జీ చేసినట్లు డాక్టర్ చంద్రభూషణ్ రెడ్డి చెప్పారు. అయితే, డిశ్చార్జీకి నిఖిల్ తల్లిదండ్రులు అంగీకరించలేదు.

హీరో నితిన్‌లా కావాలనుకున్నా, పొడవు ఇలా వద్దు: టెక్కీ నిఖిల్సర్జరీ చేసి 15 రోజులైనా ఇప్పటికి కూడా నడవలేకపోతున్నాడని, నొప్పితో బాధపడుతున్నాడని, ఈ స్థితిలో డిశ్చార్జి చేయడం సరికాదని గోవర్దన్ రెడ్డి అన్నారు. శస్త్రచికిత్స చేసిన వైద్యుడే డిశ్చార్జీ తర్వాత స్వయంగా తమ ఇంటికి వచ్చి తదుపరి చికిత్సలు చేసేందుకు అంగీకరిస్తే డిశ్చార్జీకి ఒప్పుకుంటామని చెప్పారు. దీంతో అందుకు అంగీకరిస్తూ చంద్రభూషణ్ రెడ్డి హామీ పత్రం రాసిచ్చారు.

Techie Nikhil Reddy discharged from Global hospitals

గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు ఇప్పటి వరకు మూడున్నర లక్షల రూపాయలు తీసుకున్నారని గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. నిఖిల్ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడని, ఇతరుల సాయం లేనిదే నడవలేకపోతున్నాడని, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారని ఆయన చెప్పారు.

కాసుల కోసం నిఖిల్ కాళ్లు కోశారు: ఆపరేషన్ ఇలా, సంక్లిష్ట ప్రక్రియ (పిక్చర్స్)ఇదిలావుంటే, ఎత్తు పెంపు సర్జరీపై భారత వైద్య మండలి (ఎంసిఐ) విచారణ ప్రారంభించింది. తల్లిదండ్రులకు చెప్పకుండా నిఖిల్ రెడ్డికి గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేయడం వివాదంగా మారింది. దీంతో ఆస్పత్రికి ఇప్పటికే ఎంసిఐ నోటీసులు జారీ చేసింది. దీంతో బుధవారంనాడు చంద్రభూషణ్ రెడ్డి ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+