హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరదలు కావాలంటున్నాడు: బాత్రూం వద్ద కెమెరాలు పెట్టి భార్యపై టెక్కీ నిఘా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలోని మాసాబ్ ట్యాంకులో బుధవారం ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ఘాతుకం వెలుగు చూసింది. నీ చెల్లెలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి మరీ భార్యను వేధించిన సంఘటన తాజాగా వెలుగు చూసింది. నిందితుడి పేరు శివశంకర్.

శివశంకర్ తన భార్య పూర్ణజ్యోతితో కలిసి మాసాబ్ ట్యాంక్‌లో నివసిస్తున్నాడు. అతను గత కొద్ది రోజులుగా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి మరీ భార్యను వేధిస్తున్నాడు. ఆమె చెల్లెలిని చేసుకుంటానని భార్యను బెదిరిస్తున్నాడు. అతని వేధింపులు తాళలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోను ఇలాగే వేధించాడని చెప్పింది.

అతను ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి.. భార్య కదలికల పైన నిఘా వేయడం గమనార్హం. ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా చేశాడు. వీరిద్దరికి గత ఏడాది నవంబర్ నెలలో పెళ్లైంది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే భర్త నుంచి, అత్త నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి.

 Techie torched wife with CC cameras in residence

పెళ్లి ఇష్టం లేక... భర్తను మార్చారు

పెళ్లై పది నెలలు అవుతోందని బాధితురాలు చెప్పారు. తన అత్తగారికి పెళ్లి ఇష్టం లేదన్నారు. కాబట్టి మా మధ్య విభేదాలు వచ్చేలా చేసిందన్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి తన అత్త మావారికి చెప్పి, ఇరువురి మధ్య గొడవ పెట్టిందన్నారు.

చెల్లితో పెళ్లి చేయాలని..

మా అత్త తనను కొట్టిందన్నారు. మా అత్త చెప్పింది విని తన భర్త కూడా చేయి ఎత్తారన్నారు. విదేశాల్లో ఉన్న తన సిస్టర్ ఇన్ లా కూడా తనను వేధించిందన్నారు. మా చిన్న చెల్లె దుబాయ్‌లో ఉంటుందని, ఆమెను ఇచ్చి పెళ్లి చేయాలని వేధిస్తున్నారన్నారు. ఆమెతో పెళ్లి చేస్తేనే కాపురం చేస్తామని చెబుతున్నారన్నారు.

మా ఇద్దరిని వేరుగా ఉంచాలని తన మామయ్య నిర్ణయించాడన్నారు. కానీ తన పైన ఏదో కారణంతో.. ఇంట్లో మొత్తం వీడియోలు పెట్టారన్నారు. తాను ఎవరితోను మాట్లాడవద్దని, ఎవరినీ పలకరించవద్దని మూడు కెమెరాలు ఏర్పాటు చేశారని చెప్పారు.

ఇప్పుడు వారానికి ఒకటి రెండుసార్లు

తన భర్త వారానికి ఒకటి రెండుసార్లు మాత్రమే ఇంటికి వచ్చేవారన్నారు. గతంలో వారానికి మూడుసార్లు వచ్చేవారని, ఇప్పుడు వారానికి ఒకసారి మాత్రమే వస్తున్నారన్నారు. సీసీ కెమెరాలకు మొత్తం కనెక్షన్లు.. ఆయన బెడ్ రూంలోకి ఇచ్చారన్నారు. తామిద్దరు బెడ్ రూంలు వేరని చెప్పారు.

తాను అతనికి ఏం కానట్లు, తనను అసహ్యించుకుంటున్నట్లుగా చూస్తున్నారన్నారు. ఇక్కడ ఓ చిన్న బాత్రూం ఉందని, ఇలాంటి ప్రాంతంలో సిసి కెమెరా పెట్టారని, అలాంటప్పుడు ఎలా దుస్తులు మార్చుకోవాలన్నారు. కిచెన్ సామాన్లు కూడా లేవన్నారు. తాను ఇన్నాళ్లు సర్దుకున్నానని, కానీ ఇప్పటి దాకా సర్దుకోలేదన్నారు. ఇక తాను ఓపిక నశించి ఇలా చేశారన్నారు.

కెమెరా వీడియోలను ఫోన్ ద్వారా చూసిన భర్త

ఇంట్లో పెట్టిన సీసీ కెమెరాల్లోని వీడియో క్లిప్పులను చూసేందుకు తన భర్త తన ఫోన్‌కు అటాచ్ చేసుకున్నాడని చెప్పారు. వైఫై ద్వారా ఆన్ లైన్లో చూస్తుంటాడని బాధితురాలి చెప్పారు. మొబైల్ ద్వారా కదలికలు తెలుసుకునేవాడన్నారు.

పెళ్లప్పుడు ఏది అడిగితే అదిచ్చాం: బాధితురాలి తండ్రి

కుటుంబం మంచిదనే ఉద్దేశ్యంతో తాము పెళ్లి చేశామని బాధితురాలి తండ్రి చెప్పారు. కానీ అమ్మగా ఉండాల్సిన అత్త, పెళ్లి చేసుకున్న భర్త ఇలా చేస్తాడని తాము అనుకోలేదన్నారు. పెళ్లి సమయంలో తాము ఏది అడిగితే అది ఇచ్చామని చెప్పారు. వెండి సామాన్లు, 15 తులాల బంగారం ఇచ్చామన్నారు.

ఈ అమ్మాయితో పాటు ఆమె సోదరిని కూడా పెళ్లి చేసుకోవాలని అతను కోరుకుంటున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన రెండు రోజుల నుంచే ఈ వేధింపులు ప్రారంభమయ్యాయన్నారు. తమ కూతురును ఓ విధంగా శవంలా చేసిందన్నారు.

మంచి కుటుంబం అనుకున్నాం: బాధితురాలి తల్లి

ప్రతిసారి తన కూతురును ఎన్నో విషయాలు అడిగేవారమని బాధితురాలి తల్లి అన్నారు. ఏదైనా తమకు చెబితే.. తల్లిదండ్రులకు ఎందుకు చెప్పావని అడిగేవారన్నారు. తాము పుణేలో ఉంటామని, తన కూతురు బాధ తెలిసి ఇటీవలే హైదరాబాద్ వచ్చామన్నారు.

తమ బంధువులు విశాఖ, తెనాలిలలో ఉన్నారని చెప్పారు. తమ కూతురు పెద్ద సోదరి మంచివారేనని, కానీ అమెరికా ఉన్న చిన్న సోదరి మాత్రం వేధిస్తున్నారన్నారు. తొలుత మామగారు బాగుండేవారని, కానీ ఇప్పుడు మారిపోయారని చెప్పారు. ఇలా వీడియోలు పెట్టడంపై కుటుంబ సభ్యులు నోరు మెదపలేదన్నారు.

నా చెల్లెలితో పెళ్ళి కావాలంటున్నాడు: నారాయణగూడ పీఎస్‌లో ఫిర్యాదు

కాగా, బాధితురాలు నారాయణగూడ పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేసింది. ఇంట్లో కెమెరాలు, మైక్రోఫోన్లు అమర్చి తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నా చెల్లెలితో వివాహం జరిపించాలని వేధిస్తున్నాడని చెప్పింది. తన భర్త పైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

English summary
Techie torched wife with CC cameras in residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X