హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో బుల్లెట్‌తో పట్టుబడిన ఎన్నారై టెక్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలో పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్‌తో పోలీసులకు చిక్కాడు. అమెరికాకు తిరిగి వెళ్తున్న సమయంలో సమయంలో అతన్ని పోలీసులు పట్టుకున్నారు.

దిల్‌షుక్‌నగర్‌కు చెందిన నాగ మురళీ కృష్ణ అనే టెక్కీ విమానం ఎక్కుతున్న సమయంలో భద్రతాధికారులు అతని బ్యాగేజీలో బుల్లెట్ ఉన్న విషయాన్ని గుర్తించారు అతన్ని పోలీసులకు అప్పగించారు. అతను అమెరికాలోని ఓ బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్న విచారణలో తేలింది.

Arrest

అనుకోకుండా అతను బుల్లెట్‌ను తెచ్చినట్లు అధికారులు గుర్తిచారు. గతంలో తాను సందర్శించిన అమరికా షూటింగ్‌ రేంజ్‌ నుంచి తాను ఆ బుల్లెట్ తెచ్చినట్లు అతను తెలిపారు. అప్పుడు దాన్ని సంచీలో పెట్టుకున్నానని, అది తన బ్యాగులో ఉన్న విషయాన్ని మరిచిపోయానని అతను చెప్పాడు.

కొద్ది రోజులు సెలవులు గడపడానికి మురళీ కృష్ణ హైదరాబాదు వచ్చారు. బుల్లెట్ తన బ్యాగులో ఉన్న విషయం తనకు గుర్తు లేదని మురళీకృష్ణ చెప్పారు. అయితే, ఆయుధాలు కలిగి ఉండడానికి అవసరమైన లైసెన్స్ అతని వద్ద లేదని పోలీసులు చెప్పారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

English summary
A techie working in the United States and returning there after a holiday was arrested by Rajiv Gandhi International Airport police for carrying a live bullet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X